తెలంగాణలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు
x

తెలంగాణలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణలో సోమవారం ఐఎఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి. సాధారణ పరిపాలన శాఖ సోమవారం జీఓఆర్టీ నంబరు 1429 తో అధికారుల బదిలీల జీఓను ప్రభుత్వం విడుదల చేసింది.


తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఎఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

- నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు. రంగారెడ్డి కలెక్టరుగా ఉన్న కె శశాంకను బదిలీ చేశారు.
- తెలంగాణ పర్యాటక శాఖ డైరెక్టరు ఇలా త్రిపాఠిని నల్గొండ కలెక్టరుగా బదిలీ చేశారు.
- రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఎం హనుమంతరావును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరుగా ప్రభుత్వం నియమించింది. యాదాద్రి భువనగిరి కలెక్టరుగా ఉన్న జిందగీ హనుమంత్ కొండిబాను బదిలీ చేశారు.
- డాక్టర్ టీకే శ్రీదేవిని మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టరుగా వీపీ గౌతం స్థానంలో నియమించింది.
- నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరుగా ఉన్న మంద మకరందును సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టరుగా నియమించింది.
- జెండగి హనుమతంత్ కొండిబాను దేవాదాయ శాఖ డైరెక్టరుగా బదిలీ చేశారు.
- రంగారెడ్డి కలెక్టరుగా ఉన్న కె శశాంకను స్టేట్ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు కమిషనరుగా బదిలీ చేశారు.
- రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్న ఎస్ హరీష్ ను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనరుగా నియమించారు.
- వైద్యశాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్న టి వినయ్ కృష్ణారెడ్డిని ఆర్ అండ్ ఆర్ కమిషనరుగా నియమించారు.
- పోస్టింగు కోసం ఎదురు చూస్తున్న అయేషా మస్రత్ ఖానంను వైద్యశాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు.
-టీజీఐఐసీ ఈడీగా ఉన్న నిఖిల్ చక్రవర్తిని వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనరుగా నియమించారు.
- హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డిని తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా బదిలీ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జడ్పీ సీఈఓగా ఉన్న ఎస్ దిలీప్ కుమార్ ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనరుగా నియమించారు.


Read More
Next Story