
చార్మినార్ వద్ద ఘోర అగ్నిప్రమాదం, 17మంది మృత్యువాత
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. ఏసీ కంప్రెషర్ పేలడంతో భవనంలోవారు మంటలతోపాటు పొగ వల్ల 8 మంది మృత్యువాత పడ్డారు.
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ గుల్లార్ హౌస్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో 17 మంది మరణించారు. భవనం గదుల్లో నిద్రలో ఉండగా ఏసీ కంప్రెషర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు.ఇరుకు గదిలో జరిగిన అగ్నిప్రమాదంతో వారు బయటపడేందుకు ఇబ్బంది ఏర్పడింది.ఒకే గదిలో 30 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. మృతుల్లో సుమిత్ర(65),అభిషేక్ (30), ఆరూషి జైన్(17 ),హర్షాలీ గుప్తా (7), మున్సీబాయ్ (72), శీతల్ జైన్ (37), రాజేందర్ (67), ఇరాజ్ (2) మంది ఉన్నారు. మూడు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యశోదా, అపోలో ఆసుపత్రి,
25 మంది కాపాడిన ఫైర్ సిబ్బంది
లోపల మంటల్లో చిక్కుకున్న 25 మందిని కాపాడామని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే 10 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇరుకు గదిలో నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చేందుకు భవనం గోడను పగుల గొట్టారు.
ఏసీ కంప్రెషర్ పేలిందా?
ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏసీ కంప్రెషర్ పేలిందా లేదా షార్ట్ సర్క్యూట్ అయిందా అనేది తేలాల్సి ఉంది. ఏసీ కంప్రెషర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత వెలువడిన పొగ వల్ల లోపల చిక్కుకున్న వారు మరణించారు. మంటలు, పొగ కారణంగా వారు మరణించారు.
సంఘటన స్థలానికి కేంద్రమంత్రి
అగ్నిప్రమాద ఘటన గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి గోడను బద్దలు కొట్టి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం లో 17 మంది మరణించడంతో చార్మినార్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. అఫ్జల్ గంజ్ భవనంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరవక ముందే చార్మినార్ వద్ద మరో ప్రమాదం జరిగింది.
Next Story