బ్రేకింగ్ న్యూస్:  పూసుగుప్ప బేస్ క్యాంప్ పై మావోయిస్టుల దాడి
x

బ్రేకింగ్ న్యూస్: పూసుగుప్ప బేస్ క్యాంప్ పై మావోయిస్టుల దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టులు బుధవారం దాడికి పాల్పడ్డారు. చర్ల మండలం పూసుగుప్ప బేస్ క్యాంప్ పై బీజీఎల్ లాంచర్లతో మావోయిస్టులు దాడి చేశారు.


తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప పోలీసు బేస్ క్యాంపుపై బుధవారం సాయంత్రం మావోయిస్టులు బీజీఎల్ లాంచర్లతో దాడి చేశారు. మావోయిస్టులను అణిచి వేసేందుకు పూసుగుప్ప బేస్ క్యాంపులో సాయుధ పోలీసులు మకాం వేశారు. దీంతో బేస్ క్యాంపుకు సమీపంలో బీజీఎల్ లాంచర్లతో మావోయిస్టులు మెరుపు దాడి చేశారు.

- పోలీసు బేస్ క్యాంపు సమీపంలో నుంచి మావోయిస్టులు రాకెట్ లాంచరుతో దాడి చేయగా అది గురి తప్పడంతో భారీ ప్రమాదం తప్పిందని పోలీసులు చెప్పారు. అనంతరం మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు.మావోయిస్టుల కాల్పులను సాయుధ పోలీసులు తిప్పి కొట్టారు.గంట పాటు సాగిన ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసువర్గాలు వెల్లడించాయి.

వరుస ఎదురుకాల్పులు
తెలంగాణ సరిహద్దుల్లోని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వరుస ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. సరిహద్దు అడవుల్లో గాలిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటరులో ఇద్దరు మరణించారు. సోమవారం కూడా అంబుజ్ మడ్ అడవుల్లో జరిగిన కాల్పుల్లోనూ ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం లేదని, మావోయిస్టులను తాము అణిచివేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పిన రెండు రోజులకే మావోయిస్టులు చర్ల మండలంలో పోలీసు బేస్ క్యాంపుపై దాడి చేసి వారి ప్రాబల్యాన్ని చాటారు. చుట్టు పక్కల రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉందని, తాము వారిని కట్టడి చేశామని డీజీపీ చెప్నిన రెండు రోజులకే పూసుగుప్ప బేస్ క్యాంపు పై మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడికి పాల్పడటం విశేషం.


Read More
Next Story