రేవంత్ రెడ్డి పై మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలు
x

రేవంత్ రెడ్డి పై మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా గడువకుండానే విప్లవ కారులపై దాడులకు తెగబడుతుంది అని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.


రాష్ట్రంలో కాంగ్రెస్Revanth Reddy, Maoist Party Letter, Greyhounds, Maoists Letter పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా గడువకుండానే విప్లవ కారులపై దాడులకు తెగబడుతుంది అని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం, బీజాపూర్ జిల్లా బార్డర్ లో జరిగిన ఎంకౌంటర్ ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల అయింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రేహౌండ్స్ బలగాలు 2024 ఏప్రిల్ 24 తేదీన మా పిఎల్టీఏ బలగాలపై దాడి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే గ్రేహౌండ్స్ బలగాలు PLGA పై దాడి చేశాయని ఆరోపించారు. ఈ ఎన్కౌంటర్లకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోడి, అమిత్ షాల నాయకత్వంలో కొనసాగిస్తున్న కౄరమైన విప్లవ ప్రతిఘాతుక కగార్ దాడిలో విప్లవకారులను హతమార్చడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుని దాడులకు పూనుకుంటున్నాడు.అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్కౌంటర్ లో మృతి చెందిన ముగ్గురు కామ్రేడ్లుకు విప్లవ జోహార్లు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవకారులపై కొనసాగిస్తున్న హాత్యాకాండను, నరహంతక దాడులను వ్యతిరేకించాలని లేఖలో డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పే ఉద్యమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్న విషయాలు..

"ములుగు జిల్లా వెంకటాపూర్ (నూగూర్) మండలం, బీజాపూర్ జిల్లా బార్డర్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రేహౌండ్స్ బలగాలు 2024 ఏప్రిల్ 24 తేదీన మా పిఎల్టీఏ బలగాలపై దాడి చేశాయి. ఎస్ఐబి పోలీసులు కూలీకి వెళ్తున్న సాధారణ ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి మావోయిస్టుల సమాచారం చెప్పాలని లేకుంటే ఎన్ కౌంటర్ చేస్తామని, కేసులు పెడుతామని, జైల్లో పెడతామని బెదిరింపులకు గురి చేసి, వేధించి ఇన్ఫార్మర్లుగా మార్చుకొన్నారు. వారిని వేటగాళ్ళ పేరుతో జంతువుల వేటకు పంపించి వారి ద్వారా సమాచారం సేకరించారు.

వారం రోజులుగా మా పిఎల్టీఏ బలగాల కదలికలను, మకాం సమాచారాన్ని సేకరించి దాని ఆధారంగా దాడి పథకం రూపొందించారు. పథకం ప్రకారం ఏప్రిల్ 05వ తేదీన సాయంత్రం తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు నూగూర్ వెంకటాపూర్ మండలం పరిధి నుండి అడవిలోకి ప్రవేశించి రాత్రికి రాత్రి మా పిఎల్టీఏ బలగాలున్న చోటుకు చేరుకున్నాయి. 6వ తేదిన తెల్లవారు ఝామున మకాంను చుట్టుమట్టి 5.10 నిమిషాలకు మా బలగాలపై మూకుమ్మడి దాడి చేశాయి. ఈ దాడిలో అమూల్యమైన ముగ్గురు ప్రజావీరులు మధ్య రీజనల్ కంపెనీ-2కి చెందని కమాండర్ అన్నె సంతోష్ (శ్రీధర్, సాగర్, అదే కంపెనీకి చెందిన ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు కా. ఆప్కా మనీరామ్, పిఎల్టీఏ సభ్యుడు పూనెం లక్ష్మణ్ అమరులయ్యారు.

తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు తమ కౄరత్వాన్ని ప్రదర్శించడానికి గాయాలతో నిరాయుధంగా పడి వున్న ఆప్కా మనిరామ్ ను ప్రాణాలతో పట్టుకుని కత్తులతో పొడిచి, పొడిచి చంపారు. పూనెం లక్ష్మణ్ శవంపై బండలతో దాడి చేసి తలను నుజ్జు, నుజ్జు చేసి మానవ మృగాలమని మళ్ళీ మళ్ళీ నిరుపించుకున్నారు. ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి.

గ్రేహౌండ్స్ బలగాల చుట్టువేత దాడిని చేదించడానికి అత్యంత ధైర్య సాహసాలను ప్రదరిస్తూ, విరోచితంగా పోరాడి ప్రజవీరులు తమ నెత్తురు చిందించారు. ప్రజల రాజ్యాధికారం కోసం నూతన ప్రజాస్వామిక విప్లవ విజయంకై సాగుతున్న దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన వీర యోధులకు వినమ్రంగా తలవంచి జోహర్లు అర్పిద్దాం. వారి ఆశయాల సాధన కోసం మనమంతా వారి మార్గంలో తుద వరకు కొనసాగుదాం. ఈ కామ్రేడ్స్ యొక్క సంస్మరణ సభను జరుపుకున్నాయి. ఈ సందర్భంగా మా పార్టీ, పిఎల్టీఏ బలగాలు వినమ్రంగా విప్లవ జోహార్లు తెలుపుతు శ్రద్ధాంజలి ఘటించారు. ఇదే సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాము.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్త విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్మంతో విప్లవ ప్రతిఘాతుక కాగార్ ఆపరేషన్ ను తీవ్రతరం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా గడువకుండానే విప్లవ కారులపై దాడులకు తెగబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారం కోసం ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏడో గ్యారంటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బద్ది జీవులతో, ప్రజాస్వామ్యవాదులతో జరిగిన చర్చలో ప్రకటించాడు. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అంటూ ప్రజలను నమ్మించి నేడు అధికారంలోకి వచ్చాకా అదే ప్రజలపై ఇప్పుడు అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలనంటూ ఊదరగొట్టి ప్రజల సభలను అడ్డుకుంటూ పౌర హక్కులను కాలరాస్తున్నారు.

ప్రజా యుద్ధంలో అసువులు బాసిన తమ కొడుకుల జ్ఞాపకాలను స్మరించుకోవడానికి వారి తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు వారిపై ప్రేమతో స్థూపాలను నిర్మించుకొంటుంటే వాటిని కూడా పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారు. స్థూపాల నిర్మాణాలు కట్టకూడదంటూ కుటుంబ సభ్యులకు వార్నింగ్ లు ఇస్తున్నారు. దేశంలో ఎన్డీఏ, ఇండియా కూటములు మద్య అధికారం కోసం పోట్లాటలున్నప్పటికీ మావోయిస్టు పార్టీని నిర్మూలించడం, సామ్రాజ్యవాదుల, ఘరాన కార్పోరేట్ల దోపిడికి కొమ్ము కాయడంలో బీజేపి, కాంగ్రెస్ ల మధ్య తేడా ఏమిలేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో వుండగా కేసిఆర్ నిరంకుశ పాలన పోవాలంటే నక్సలైట్లు రావాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డికి, నరెంద్రమోడీని, ఆదానిని కలిసిన తరువాత అదే నక్సలైట్లు తీవ్రవాదులుగా కనబడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడి, అమిత్ షాల నాయకత్వంలో కొనసాగిస్తున్న కౄరమైన విప్లవ ప్రతిఘాతుక కగార్ దాడిలో విప్లవకారులను హతమార్చడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుని దాడులకు పూనుకుంటున్నాడు.

ప్రజలారా! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విప్లవకారులపై, ప్రజాస్వామికవాదులపై కొనసాగిస్తున్న దాడులను ఖండించండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రజాస్వామికవాదులు, మేధావులంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని నిలదీయండి. పోరాడండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెడుతున్న కగార్ దాడిని నిరసిస్తూ 15వ తేదీన ఇచ్చిన సీఆర్బీ బందు పిలుపును విజయవంతం చేయండి" అని మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Read More
Next Story