పదవి రాగానే ఫామ్ హౌస్‌పై ప్రకటన.. మహేందర్ మాస్టర్ ప్లానేంటో..!
x

పదవి రాగానే ఫామ్ హౌస్‌పై ప్రకటన.. మహేందర్ మాస్టర్ ప్లానేంటో..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రాజనర్సింహ తన ఫామ్ హౌస్‌పై కీలక ప్రకటన చేశారు. తన ఫామ్ హౌస్ పూర్తిగా నిబంధనలను కట్టుబడి నిర్మించిన భవనం అని అన్నారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రాజనర్సింహ తన ఫామ్ హౌస్‌పై కీలక ప్రకటన చేశారు. తన ఫామ్ హౌస్ పూర్తిగా నిబంధనలను కట్టుబడి నిర్మించిన భవనం అని అన్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, కేటీఆర్, హరీష్‌రావు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారి ఆరోపణలు చెవిలో చోరీగలా మారడంతోనే ఈరోజు ఈ ప్రకటన చేస్తున్నానని చెప్పారు. తన ఫామ్ హౌస్ నిబంధనలను విరుద్ధంగా ఉందని నిరూపిస్తే దానిని తానే సొంత ఖర్చుతో కూల్చివేస్తానని స్పష్టం చేశారు. తాను తన ఫామ్ హౌస్‌ను ఇష్టారాజ్యంగా నిర్మించలేదని, అధికారులను అడిగి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే నిర్మించుకున్నానని చెప్పారు. తన ఫామ్ హౌస్ వ్యవహారంపై ఈరోజు ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. తనది అక్రమ నిర్మాణం అని తేలిస్తే కేటీఆర్ రావాలని, ఆయన కళ్లముందే తానే చర్యలు తీసుకోని కూల్చేపిస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు.

‘‘నా ఫామ్ హౌస్ అన్ని నిబంధనల ప్రకారమే ఉందని అధికారులు రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఎక్కడా కూడా ఒక్క అంగుళం స్థలం కూడా నేను ఆక్రమించలేదు. అక్రమంగా నిర్మించలేదు. నా ఫామ్ హౌస్‌లో మామిడి తోట కూడా ఉంది. దానికి కూడా అనుమతులు ఉన్నాయి. అధికారులను అడిగి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ఫామ్ హౌస్ కట్టాను. అన్నీ రూల్స్ ప్రకారమే ఉన్నాయి. నా ఫామ్ హౌస్ బఫర్ జోన్‌లో కానీ, ఎఫ్‌టీఎల్ పరిధిలో కానీ లేదు. అధికారులు వచ్చి అంతా చెక్ చేసి మరీ లీగల్‌గా ఉందని చెప్పారు. నా ఫామ్ హౌస్ లీగల్‌గా ఉన్నా కూల్చేయాలని మాజీ మంత్రులు కేటీఆర్, సబిత, హరీష్‌ర3వు పట్టుబడుతున్నారు. జీఓ 111 రాష్ట్ర పరిధిలో లేదు. అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే జీవో111 విషయంలో ముందుకు వెళ్లాలి’’ అని ఆయన స్పష్టం చేశారు.

అధికారంతోనే ప్రకటన..

పట్నం మహేందర్‌ రెడ్డి ఫామ్ హౌస్ వివాదం ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన అంశం కాదు. చాలా కాలంగానే ఆయన ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మాణం అంటూ బీఆర్ఎస్ నేతలు ఫొటోలు, మ్యాప్‌లు వేసి మరీ ఘంఠాపథంగా అంటున్నారు. కానీ ఇన్ని రోజులు మౌన మునిగా ఉన్న ఆయన ఈరోజు పెదవి విప్పి.. తన ఫామ్ హౌస్ లీగల్‌గా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు స్వీకరించి మరుసటి రోజే తన ఫామ్‌హౌస్ గురించి ఆయన మాట్లాడటం ఇప్పుడు కీలకంగా మారింది. చేతికి అధికారం రావడంతోనే ఆయన ఈ ధైర్యం చేశారని, నిజంగా ఆయన ఫామ్ హౌస్ అంతా లీగల్‌గా ఉండి ఉంటే ఇన్నాళ్లూ ఎందుకు మౌనం వహించారన్న వాదనలను కూడా వినిపిస్తున్నాయి. అధికారం రావడంతోనే దేనిననైనా మేనేజ్ చేయొచ్చన్న ధీమాతోనే ఈరోజు ఆయన తన ఫామ్ హౌస్‌పై నోరు విప్పారని కూడా చర్చలు నడుస్తున్నాయి.

అధికారం అందడమే అన్యాయమా..!

ఈ నేపథ్యంలోనే అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయిస్తే అతనికే ప్రభుత్వ చీఫ్ విప్‌గా పదవి ఎలా కట్టబెడతారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. చీఫ్ విప్‌‌కు కాంగ్రెస్ నుంచి అర్హులైన ఎమ్మెల్సీలు లేని నిస్సహాయ స్థితిలోనే కాంగ్రెస్ ఇలా చేసిందని, అందుకనే ఆఖరికి మహేందర్ రెడ్డి నియామకం గెజిట్‌ను కూడా ఇన్నాళ్లూ రహస్యంగా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. లేకుంటే ఆయన నియామకాన్ని ధృవీకరిస్తూ ప్రకటించిన జీవోలో ఆయన నియామకం మార్చి 15 నుంచి అమల్లోకి వస్తుందని ఎలా ఉందని, అప్పుడే ఆయన నియామకం జరిగి ఉంటే ఇన్నాళ్లూ ఆ గెజిట్‌ను ఎందుకు బయటపెట్టలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి వీటిపై త్వరలో ఏమైనా సమాధానాలు వస్తాయేమో చూడాలి.

Read More
Next Story