Sankranti | సంక్రాంతికి మద్యం అమ్మకాలు అంతంత మాత్రమే...
x

Sankranti | సంక్రాంతికి మద్యం అమ్మకాలు అంతంత మాత్రమే...

సంక్రాంతి సందర్భంగా మద్యం అమ్మకాలు పెరుగుతాయని ఆశించిన ఎక్సైజ్ శాఖకు ఆశాభంగం ఎదురైంది.హైదరాబాద్ ప్రజలు పల్లెలకు తరలిపోవడంతో మద్యం విక్రయాలు మధ్యస్థంగా సాగాయి.


పండుగ వచ్చిందంటే తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజలు పల్లెలకు తరలివెళ్లిపోవడంతో మద్యం అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు.

- కొత్త సంవత్సరం, దసరా,బోనాల సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31వతేదీ ఒక్కరోజే రూ.520 కోట్ల మద్యాన్ని విక్రయించారు. దసరా, బోనాలు పండుగలు వస్తే చాలు మందుబాబులు పీకల దాకా తాగి ప్రభుత్వ ఖజానాను నింపుతుంటారు.
- కానీ సంక్రాంతి పండుగకు ఆశించిన మేర మద్యం విక్రయాలు సాగక పోవడంతో మద్యం వ్యాపారులు నిరాశ చెందారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయని మద్యం దుకాణాల యజమానులు అంచనా వేశారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపోలు కూడా అధిక మద్యం అమ్మకాలుంటాయని బీరు, విస్కీ స్టాక్‌లను మద్యం షాపులు, బార్ లకు పంపించారు.
- హైదరాబాద్ నగరవాసులు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వారివారి స్వస్థలాలకు తరలివెళ్లారు. దీంతో దసరా, బోనాలతో పోలిస్తే జనం స్వస్థలాలకు వెళ్లడంతో మద్యం విక్రయాలు తగ్గాయి. దీనికి తోడు చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి, చలి పెరగడంతో బరు విక్రయాలు తగ్గాయి.


Read More
Next Story