కిసాన్‌నగర్‌లో మద్య నిషేధం,ఉల్లంఘిస్తే జరిమానా, చెప్పుల దండ
x

కిసాన్‌నగర్‌లో మద్య నిషేధం,ఉల్లంఘిస్తే జరిమానా, చెప్పుల దండ

మద్యం అన్ని అనర్ధాలకు కారణమని గుర్తించిన కిసాన్‌నగర్‌ గ్రామస్థులు మద్యాన్ని నిషేధిస్తూ తీర్మానించారు.మద్యాన్ని అమ్మినా, తాగిన జరిమానా,చెప్పులదండ వేస్తారు..


రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతంలోని కిసాన్‌నగర్‌ గ్రామం పేరు తెలంగాణలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది. కిసాన్‌నగర్‌ గ్రామంలో మద్యాన్ని విక్రయించినా, కొన్నా, తాగడాన్ని గ్రామస్థులంతా ఏకమై నిషేధించారు.

- గ్రామంలో ఎవరైనా మద్యాన్ని విక్రయిస్తే వారికి రూ.50వేల జరిమానాతోపాటు వారి మెడలో చెప్పుల దండ వేయాలని గ్రామస్థులు నిర్ణయించారు.

గ్రామంలో శాంతి కోసం...
కిసాన్‌నగర్‌ గ్రామంలో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా ఉండటంతోపాటు నేరాల కట్టడికి మద్యాన్ని నిషేధించాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. గ్రామంలో మద్య నిషేధంపై ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించారని, మద్యం తాగారనే సమాచారాన్ని అందించిన గ్రామస్థులకు పదివేల రూపాయలు నగదు బహుమతి ఇవ్వాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. మద్యాన్ని ఎవరైనా కొంటే వారికి 25వేల జరిమానా విధించి హెచ్చరిక జారీ చేయాలని తీర్మానించారు.

మరో రెండు గ్రామాల్లో మద్యనిషేధం
కిసాన్‌నగర్‌ గ్రామానికి ముందు యాదాద్రి భువనగిరి జిల్లాలోని జేతురాంతండా, తుర్కపల్లి గ్రామాల ప్రజలు కూడా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేసుకున్నారు. ఆ రెండు గ్రామాల్లో మద్యం విక్రయిస్తే లక్ష రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించుకున్నారు.కిసాన్‌నగర్‌ గ్రామస్థులు గత నెల 29వతేదీన గ్రామస్థులు సమావేశమై మద్యాన్ని విక్రయించకూడదని నిర్ణయించుకున్నారు.మద్య నిషేధాన్ని అమలు చేసిన గ్రామస్థులు నిర్ణయాన్ని గ్రామ పంచాయతీకి తెలియజేశారు.


Read More
Next Story