తెలంగాణలో మిస్ వరల్డ్ క్రిస్ట్రినా పిస్కోవాను చూద్దాం రండి
x
మిస్ వరల్డ్ అందాల భామ క్రిస్టినా

తెలంగాణలో మిస్ వరల్డ్ క్రిస్ట్రినా పిస్కోవాను చూద్దాం రండి

తెలంగాణలోని హైదరాబాద్‌లో మే నెలలో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.ఈ పోటీల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన క్రిస్ట్రినా పిస్కోవా సందడి చేశారు.


72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఈ అందాల పోటీల సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అందాల భామ మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా సందడి చేశారు.




గురువారం మీడియా సమావేశంలో ముుకుళిత హస్తాలతో తెలుగుతనం ఉట్టిపడేలా నమస్కారం చేసిన ఈ ముద్దుగుమ్మ భారత సంస్కృతి, కళలను మెచ్చుకున్నారు.




భిన్నత్వంలో ఏకత్వం ఎంతో గొప్ప భావన అని ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. తనకు హైదరాబాద్ లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని ఆమె చెప్పారు. తన హృదయంలో భారతదేశానికి ఉన్నత స్థానం ఉందన్నారు.




ఎరుపురంగు చీరలో మెరసిన అందాల భామ

అచ్చు తెలుగు పడచులా ఎరుపురంగు చీర కట్టిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా యాదగిరిగుట్ట ఆలయాన్ని బుధవారం సందర్శించారు.



ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అందాల ముద్దుగుమ్మ యాదగిరిగుట్ట విశిష్ఠత, ఆలయ సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు.




‘‘నా తెలంగాణ పర్యటన అద్భుతంగా సాగింది,యాదగిరిగుట్ట సందర్శించాల్సిన ప్రాంతం’’అంటూ మిస్ వరల్డ్ క్రిస్టినా తన ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేశారు.



Read More
Next Story