‘కాంగ్రెస్ వాళ్లను ఉరికించి కొట్టే రోజులొస్తాయి’
x

‘కాంగ్రెస్ వాళ్లను ఉరికించి కొట్టే రోజులొస్తాయి’

ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు పోరుబాట అనే బహిరంగ సభలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకెళ్లడానికైనా రెడీ అన్నారు.


ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్(BRS) నిర్వహించిన రైతు పోరుబాట(Rythu Poru Bata) అనే బహిరంగ సభలో కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాతే అంతా ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, రాష్ట్రం తిరోగమనం పట్టిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వాళ్లను ఉరికించి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో ఒక్కరు కూడా సంతోషంగా లేరని, డిచ్‌పల్లి దగ్గర పోలీసు అధికారుల భార్యలు చిన్న పిల్లలను చంకనెత్తుకుని మరీ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని గుర్తు చేశారు. మొన్నటి వరకు గ్రూప్-1 అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేపడితే అరెస్ట్‌లు చేశారని, ప్రభుత్వం అనుకున్నట్లే అక్టోబర్ 21న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించి అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల బాధలు కూడా పట్టించుకోని ఈ ప్రభుత్వం భరతం ప్రజలు అతి త్వరలోనే పడతారంటూ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎప్పుడూ, ఇప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుందని, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి తాను సైతం సిద్ధమని అన్నారు కేటీఆర్.

పనులన్నీ అస్తవ్యస్తం..

‘‘మీ దగ్గరకు చేరుకోవడం కోసమని ఉదయం ఏడున్నరకే హైదరాబాద్ నుంచి బయలుదేరాం. కానీ కాంగ్రెస్ పాలన కారణంగా దారిపొడుగూతా అన్ని పనులు అస్తవ్యవస్తంగా ఉన్నాయి. మేడ్చల్ దగ్గరే 45 నిమిషాలు పట్టింది. డిచ్‌పల్లి దగ్గర మహిళలు రోడ్డుకు అడ్డంగా కూర్చుని ధర్నా చేస్తున్నారు. ఆడబిడ్డలకు ఏం కష్టమొయ్యిందో అన్న బాధతో.. కనుక్కుందామని వారి దగ్గరకు వెళ్లాను. వాళ్లంతా కూడా పోలీసు అధికారులు భార్యలని అప్పుడే తెలిసింది. వాళ్లంతా కూడా వన్ పోలిసింగ్ కావాలని డిచ్‌పల్లి బెటాలియన్ దగ్గర ధర్నా చేస్తున్నారు. తాము ధర్నా చేస్తున్నందుకు రక్తాలు కారేలా లాగిపడేస్తున్నారని ఆడవిడ్డలు తమ కష్టాలను చెప్పుకున్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ఈ ఒక్క అంశం చాలు. పోలీసులను అడ్డు పెట్టుకుని పాలన చేస్తున్న కాంగ్రస్ హయాంలో ఆ పోలీసోళ్ల భార్యలే ధర్నాలకు దిగే పరిస్థితి వచ్చింది. వారిని కూడా సాటి పోలీసోళ్లే లాఠీ దెబ్బలు కొడుతున్న పరిస్థితి ఏర్పడింది’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వడ్డీతో సహా అన్నీ తిరిగిస్తాం..

‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇటువంటి కిరాతక పనులు బీఆర్ఎస్ పాలన జరగలేదు. ఏ మంత్రో, కంత్రో ఫోన్ చేస్తే ఆందోళన చెందకండి. న్యాయం, ధర్మం ప్రకారం ముందుకెళ్లండి. ఎవరైనా ఎక్స్‌ట్రాలు చేస్తే పేర్లు రాసుకుని మరీ మాకు అధికారం వచ్చాక వడ్డీతో సహా తిరిగిస్తా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాజో, చక్రవర్తో కాదు. ప్రజాసేవ చేయాల్సిన ముఖ్యమంత్రి. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు వంటి వాళ్లతో పోరాడినం.. ఈ చిట్టినాయుడెంత. అతన్ని చూసి భయపడొద్దు. ఉద్యోగులంతా కూడా పద్దతి ప్రకారం నడుచుకోండి. అతి చేస్తూ టైమ్ వచ్చాక రిటర్న్ గిఫ్ట్ అంతకుమించి ఉంటుంది’’ అని హెచ్చరించారు.

కేసు పెడితే ఒక్కడు కూడా ఉండడు..

‘‘ఏదో జైలుకు పంపుతా అన్నట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రైతులు, ప్రజల కోసం రెండుమూడేళ్లు జైలుకు వెళ్లడానికి కూడా నేను సిద్ధం. ఎవరీ భయపడేది లేదు. తప్పకుండా కాంగ్రెస్‌ వాళ్లను ఉరికించి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్లపై చీటింగ్ కేసులు పెట్టాలి. తులం బంగారం ఇస్తామంటూ మోసం చేసిన ఈ 420పై కేసులు పెట్టాలి. రైతు బంధు ఎగ్గొట్టారు, రణమాఫీ చేయనందుకు రైతులు కూడా కేసులు పెట్టాలి. 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వనందుకు నిరుద్యోగులు, యువత కేసులు పెట్టాలి. ఇలా అన్ని వర్గాల వాళ్లు చీటింగ్ కేసులు పెడితే కాంగ్రెస్ నాయకుడు ఒక్కడు కూడా రాష్ట్రంలో మిగలడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారీ మాజీ మంత్రి.

Read More
Next Story