ఆరున్నర గంటలు సాగిన విచారణ.. ‘ఏసీబీకి పూర్తిగా సహకరించా’..
x

ఆరున్నర గంటలు సాగిన విచారణ.. ‘ఏసీబీకి పూర్తిగా సహకరించా’..

పార్ములా ఈ-కార్ రేసు కేసు అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గురువారం ఏసీబీ ఆరున్నర గంటలపాటు ప్రశ్నించింది.


పార్ములా ఈ-కార్ రేసు కేసు అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గురువారం ఏసీబీ ఆరున్నర గంటలపాటు ప్రశ్నించింది. ఈ విచారణలో భాగంగా కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. ఆర్థిక శాఖ నుంచి కానీ ఆర్‌బీఐ నుంచి కానీ ఎందుకు అనుమతులు తీసుకోలేదని, అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు రూ.55కోట్లు ఎందుకు బదిలీ చేయించారంటూ అనేక అంశాలపై చర్చించారు. కేటీఆర్‌ను డీగఎస్పీ మజీద్ ఖాన్ విచారించగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ ఈ విచారణను పర్యవేక్షించారు. వేరే గది నుంచి విచారణను కేటీఆర్ తరపు న్యాయవాది రామచంద్రరావు పరిశీలించారు. మరోసారి ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని కేటీఆర్‌నరు తెలిపారు ఏసీబీ అధికారులు.

పూర్తి సహకారం అందించా: కేటీఆర్

గురువారం ఏసీబీ విచారణకు తాను పూర్తిగా సహకరించానని కేటీఆర్ తెలిపారు. ‘‘నాకున్న అవగాహన మేరకు ఏసీబీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పా. విచారణకు ఎప్పుడు పిలిచినా, ఎన్ని సార్లు పిలిచినా వచ్చి సహకరిస్తానని చెప్పాను. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఇది ఒక చెత్త కేసు. రాజకీయ ఒత్తిడితో మీరు ఏం చేస్తున్నారో కూడా మీకే తెలియడంలేదు, పూర్తిగా అసంబద్దమైన కేసు అని అధికారులకు చెప్పా. ఒక్క ప్రశ్ననే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగింది ఏమీ లేదు. పైసలు పంపాను అని నేనే చెబుతున్నాను. డబ్బులు వచ్చాయని వాళ్లు చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని అడిగా’’ అని కేటీఆర్ అన్నారు. అయితే కేటీఆర్‌ మీడియాతో మాట్లాడటంపై డీసీపీ విజయ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని, ఇక్కడ మీడియా సమావేశం పెట్టకూడదని చెప్పారు.

Read More
Next Story