ఐఐహెచ్‌టీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
x

ఐఐహెచ్‌టీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.


ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) సంస్థకు స్వతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఐఐహెచ్‌టీ సంస్థను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా లలిత కళాతోరణంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ఐఐహెచ్‌టీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టడం సముచితంగా ఉంటుందని, వెంటనే అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలిచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో ఆత్మగౌరవంతో బతకడానికి రైతన్న ఎంత ముఖ్యమే నేతన్న కూడా అంతే ముఖ్యమన్నారు. నేతన్న రుణాలు 30 కోట్ల రూపాయల మేరకు ఉన్నట్టయితే వాటిని మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 63 లక్షల మంది మహిళలకు ప్రతి ఏటా ఒక్కొక్కరి రెండు మంచి డిజైన్ తో కూడిన నాణ్యమైన చీరలను అందించాలని వీవర్స్ ని కోరారు. ఏడాదికి 1.30 కోట్ల చీరలను నేతన్నలకు ఆర్డర్ ఇస్తామన్నారు. నేతన్నల కోసం పెండింగ్‌ బిల్లులు కలిపి మొత్తంగా రూ. 335 కోట్ల విడుదల చేస్తామన్నారు.

హ్యాండ్లూమ్ టెక్నాలజీలో తెలంగాణ విద్యార్థులు చదువుకోవాలంటే బయటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులను గమనించి IIHT ని హైదరాబాద్‌ కు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రని, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ని కలిసి కోరడం జరిగిందని సీఎం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఐఐహెచ్‌టీ ని ఆమోదించారన్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభించడానికి నాంపల్లిలో ఖాళీగా ఉన్న తెలుగు యూనివర్సిటీ భవనంలో ఈ సంస్థను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ సంస్థలో చేరిన విద్యార్థులకు నెలకు రూ.2,500 చొప్పున స్కాలర్ షిప్ మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.

Read More
Next Story