హరీష్ కొత్త దుకాణం పెట్టేలా ఉన్నారని బాంబు పేల్చిన కోమటిరెడ్డి
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి డిపాజిట్లు కూడా దక్కవని, జూన్ 4 తర్వాత ఆ పార్టీ భూస్థాపితం అవుతుందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి డిపాజిట్లు కూడా దక్కవని, జూన్ 4 తర్వాత ఆ పార్టీ భూస్థాపితం అవుతుందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతలంతా అటూ ఇటూ తిరగాల్సిందేనన్నారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత జైలు కు వెళ్లిందని, తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్లో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన మాటలు అసహ్యంగా ఉన్నాయని, ఇదే తరహాలో మాట్లాడితే సహించబోమని చెప్పారు.
మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు, 30 వేKomatireddy Venkat Reddy
Harish Rao
KTR
KCR
CM Revanth Reddyల ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకు.. కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిడుతున్నారా..? అని ప్రశ్నించారు. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి కట్టి అభివృద్ధి చేశామని చెబుతున్నారు.. మరి ఎయిర్పోర్ట్, పీవీ ఎక్స్ ప్రెస్ వే లాంటివి కట్టిన మేము ఏం చెప్పుకోవాలి అని అడిగారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా 12 సీట్లకు పైనే విజయం సాధిస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవడం ఖాయమని... అప్పుడు కేటీఆర్, హరీష్ రావులు ఇలానే మాట్లాడితే వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళని చెప్పులతో కొడతారని ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యతలు కేటీఆర్ కి ఇస్తే హరీష్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ బాంబు పేల్చారు.
తీన్మార్ మల్లన్నపై కేసులు ఉన్నాయని విమర్శించేముందు మీ చెల్లి కవితపై ఎనిమిది వేల ఛార్జ్ షీట్ వేశారని, దీనికి ఏం సమాధానం చెబుతారంటూ కేటీఆర్ ని నిలదీశారు. మీ దోపిడీని బయటపెట్టినందుకే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. కవిత బెయిల్ కోసం ఓపెన్ గా బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి భయపడి అసెంబ్లీకి రాణి కేసీఆర్ కర్ర పట్టుకుని తిరిగి మరీ బీజేపీకి ఓట్లు వేయించారని విమర్శించారు.