కొండా సురేఖ బహిష్కరణకు కేంద్రమంత్రి డిమాండ్
x

కొండా సురేఖ బహిష్కరణకు కేంద్రమంత్రి డిమాండ్

సమంతను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ఇలాంటి వారిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.


సమంతను ఉద్దేశించి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి జీవితం గురించి మాట్లాడాటన్ని ఆయన తప్పుబట్టారు. కుటుంబాలు, మహిళలు అంటే గౌరవం ఉండాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు అది లేదంటూ చురకలంటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ-దొందేనని, మహిళలు అంటే ఏమాత్రం గౌరవం వారికి ఉండదంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉండాలని, అప్పుడే ఇలాంటి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుంటారని సూచించారాయన. అంతేకాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని బహిష్కరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే కొండా సురేఖ‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సమంత అభిమానులు చేస్తున్న డిమాండ్.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తోడుకావడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కేంద్రమంత్రి అన్నది వాస్తవం అని, కొండా సురేఖ‌ను పదవి నుంచే కాకుండా రాజకీయాల నుంచే బహిష్కరించాలంటూ సమంత అభిమానులు కొత్త డిమాండ్ ప్రారంభించారు.

శ్రీకారం చుట్టుంది కేసీఆర్..

ఇలా కుటుంబాలు, మహిళలు అంటే గౌరవం లేకుండా మాట్లాడటం అనే సాంప్రదాయాన్ని తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభించింది మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆరే అని కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రారంభించిన సంప్రదాయాన్ని కేటీఆర్ ముందుకు నడిపించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గంలో పయణిస్తున్నారని, తన మంత్రివర్గాన్ని కూడా అటు నడిపిస్తున్నారంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన చేసిన గాయం మానిపోదని, ఎంతో కష్టంతో మర్చిపోయిన అంశాన్ని కొండాసురేఖ మళ్ళీ రెచ్చగొట్టి సమంతను, ఆమె అభిమానులను ఎంతో వ్యధకు గురి చేశారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిగజారుతున్న తెలంగాణ రాజకీయాలు

‘‘తెలంగాణ రాజకీయాల్లో మార్పు రావాలి. కుటుంబం, వ్యక్తిగత విషయాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజారు. ఫోన్ ట్యాపింగ్‌లో ప్రజల ప్రవైటే సంభాషణలు విన్నారని కోర్టు అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. ఇలాంటి ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణ రాజకీయాలంటే దిగజారిపోతున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా కలిసి కట్టుగా ఈ రెండు పారటీలను బహిష్కరించాలి’’ అని కిషన్ రెడ్డి కోరారు. ఒకవైపు హైడ్రా పేరుతో పేదల ఇళ్లే టార్గెట్‌గా సాగుతున్న రేవంత్ సర్కార్.. ఇప్పుడు తమ సొంత రాజకీయాల కోసం ప్రజల జీవితాలను కూడా బజారుకీడుస్తోందంటూ ఆయన మండిపడ్డారు.

Read More
Next Story