Telangana Legislative Assembly | తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు
తెలంగాణ సర్కార్ సోమవారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. హైడ్రా, మూసీ నది సుందరీకరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాలు, పరిపాలనా సౌలభ్యం కోసం సంస్కరణలు తీసుకురావడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆరు హామీలను నెరవేర్చడంతో పాటు, ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా, మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్,నీటి వనరుల పరిరక్షణతో సహా పలు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
ధరణి పోర్టల్‌లో ఉల్లంఘనలను గుర్తించిన ప్రభుత్వం, తదుపరి సెషన్‌లో ఆర్వోఆర్ 2024 చట్టంపై బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది.
- త్వరలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముగ్గురు పిల్లలు ఉన్న అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిస్తోంది. ఇంతకుముందు గరిష్ఠంగా ఇద్దరు పిల్లలు ఉన్నవారు మాత్రమే పోటీకి అర్హులు.
- రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో గ్రామాలు, మునిసిపాలిటీలను అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలలో విలీనం చేయడంలో సంస్కరణలను తీసుకువచ్చింది. గ్రామాలు, మున్సిపాలిటీల విలీన బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం వివిధ జోన్‌లుగా విభజించే అవకాశం ఉంది.
- రైతు భరోసా, ఇతర సమస్యలకు సంబంధించిన బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది.
అసెంబ్లీలో వార్షిక నివేదికలు
2022-23 సంవత్సరానికి గాను తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ 9వ వార్షిక నివేదిక ప్రతిని సభలో ప్రవేశపెట్టనున్నారు.తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ 7వ వార్షిక నివేదికను సభలో ఉంచుతారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశాలను శాసనమండలిలోనూ ప్రవేశపెట్టనున్నారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తి అయిన నేపథ్యంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి. సోమవారం పదిన్నర గంటలకు ప్రారంభం అయ్యే ఈ సమావేశాలు కీలకం కానున్నాయి.
Next Story