Revanth Reddy | ‘తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కేసీఆర్ కూడా రావాలి’
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. అదే విధంగా ఈ వేడుకకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్(KCR) కూడా రావాలని కోరారు. ఈ మేరకు డిసెంబర్ 9న జరిగే విగ్రహావిష్కరణ వేడుకకు కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌నరు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అందరి సహకారంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పేదవారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. సొంత ఇల్లు, వ్యవసాయ భూమిని ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంగా భావిస్తారని, దానిని గమనించే ఇందిరా గాంధీ.. సొంతింటి నిర్మాణం, భూపంపిణీ కార్యక్రమాలను చేపట్టారని రేవంత్ అన్నారు.
‘‘పేదవారు ఆత్మ గౌరవంతో బతకాలి. ఆనాడే ఈ విషయాన్ని ఇందిరా గాంధీ గుర్తించారు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. తద్వారా పేదవారికి భూ పంపిణీ ద్వారా వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. ఈరోజు ఏ గ్రామంలో చూసినా దళితులకు ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఉన్నాయి. గుడి లేని ఊరు ఉన్నదేమో కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని గ్రామం దేశవ్యాప్తంగా ఎక్కడా లేదు. ఇందిరమ్మ ఇండ్లకు సాయం ప్రజాప్రభుత్వంలో 5 లక్షలకు పెంచాము. లబ్ధిదారుల ఎంపికను AI సాయం ద్వారా నిజమైన అర్హులకే అందేలా చర్యలు. ఇంటి నిర్మాణంలో ఎలాంటి డిజైన్ల షరతులు లేవు. లబ్ధిదారుల వారికి అనుకూలంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. మొదటి ఏడాది 4 లక్షల 59వేల ఇళ్లు, ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు అనుమతుల మంజూరు చేశాం. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నారు. మేము ఇల్లు కట్టి ఇస్తాము.. మీరు పెళ్ళిళ్ళు చేయండి. గిరిజనులు, పారిశుధ్య కార్మికులు, అత్యంత పేదవారికి ప్రాధాన్యం. పైరవీలకు తావులేకుండా అర్హుల ఎంపిక చేస్తున్నాం. ఐటీడీఏ ఆదివాసీల ప్రాంతాలకు అదనంగా ఇళ్ళు మంజూరు చేస్తాము’’ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పలు సూక్తులు కూడా చెప్పారు రేవంత్.
కేసీఆర్‌నరూ ఆహ్వానిస్తాం..
‘‘డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ సిఎం కెసిఆర్‌కి ఆహ్వానం పంపిస్తున్నాం. కేటీఆర్, హరీష్ ఇద్దరూ కూడా శాడిస్టిక్ ఆలోచన ఉన్నవారే. ఎవరు చట్టానికి అతీతు కాదని మీ పిల్లలకు చెప్పాలి కదా కేసీఆర్? ఎప్పుడైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ నిర్మాణం చేస్తున్నాం. నిరుపేదలు ఎవరైనా ఎలా కట్టుకోవాలి అనేది చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కెసీఆర్‌కి, బీజేపీ పార్టీ అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రజా విజయోత్సవాలుకు ఆహ్వానం పంపుతున్నాము’’ అని రేవంత్ వివరించారు.
వైఎస్‌ఆర్ హయాంలోనే ప్రాంరభం..
‘‘2004-14 వరకు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదలకు 25 లక్షల 4వేల ఇండ్లను పేదలకు ఇచ్చాం. బీఆర్ఎస్ హయాంలో డబులు బెడ్ రూమ్‌లు ఎంత మందికి ఇచ్చారు? బీఆర్ఎస్ కట్టిన డబుల్ బెడ్ రూమ్‌లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను మేము చెల్లించాం. గత ప్రభుత్వ ప్రాధాన్యతలు వారి భవనాలు, వారి పార్టీ భవనాలు మాత్రమే. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణను ఒక మిగులు రాష్ట్రంగా అప్పగించింది. అటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది. పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారు. వేలాది ఎకరాల భూములు అమ్ముకున్నారు. పెదవారి భూములను లాక్కున్నారు. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కండ్లుగా కాంగ్రెస్ 50 ఏళ్లు పరిపాలన చేసింది’’ అని పేర్కొన్నారు.
‘‘ప్రభుత్వ పరిస్థితిపై శాసనసభలో శ్వేత పత్రాలను విడుదల చేశాం. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మాకు కనీసం సమయం ఇవ్వకుండా విమర్శలు చేస్తుంది. గతంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాలకి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నప్పుడు వైఎస్ ద్వారా కాంగ్రెస్ లో చేరాలని చూశాడు. గతంలో మేము ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలుగా సీఎం లను కలిసేవారము. సాంప్రదాయాలను దెబ్బ తీశారు. ఇండియా-పాకిస్థాన్ సరిహద్దులా పాలక ప్రతిపక్ష పార్టీల మధ్య పరిస్థితికి తయారు చేశారు. ప్రతిపక్ష పార్టీగా మీ విధానం ఏమిటి?’’ అని ప్రశ్నించారు.
‘‘119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం. పాలక ప్రతిపక్షాలు స్పీకర్‌కు రెండు కళ్ళు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు సభకే రారు. ఆ కుర్చీ ఖాలీగా ఉండడం తెలంగాణకు మంచిదేనా ? అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టండి. మీ అనుభవాన్ని ప్రజలకోసం వినియోగించండి. మీరు సలహాలు, సూచనలు చేయండి. మీ పిల్లలను మాపైకి ఉసింగోల్పడం కరక్తేనా..? డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మిమ్మల్ని ఆహ్వానిస్తాం. ఇది మన అందరి పండుగ. తమిళనాడు హక్కుల కోసం తమిళనాడులో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఓకే తాటిపై అంటారు. నిజాం ప్రభువే ప్రజా ఉద్యమానికి తల వంచారు. కొత్తగా పెళ్ళైన అల్లుడు ఆషాడ మాసం వస్తె అత్తగారి ఇంటికి పోలేని పరిస్థితి. మాకు పార్లమెంటు ఎన్నికలు తర్వాత మిగిలిన సమయం తక్కువే కదా.. సమయం ఇవ్వాలి కదా... హరీష్ , కేటీఆర్‌లకు ప్రభుత్వాన్ని పడ గొట్టలానే దుందుడుకు చర్యలు చేస్తే... మీ పిల్లలకి మీరు చెప్పాలిగా కేసీఆర్ సారు’’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.
‘‘ఎవరూ చట్టానికి అతీతులు కారు.. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సచివాలయానికి మా ఒత్తిడి మేరకే అంబేద్కర్ పేరు పెట్టారు. మమ్మల్ని కుర్చీలో చూడడం మీకు నామోషీగా అనిపిస్తే.. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండండి. మీ తప్పులను సరి దిద్దుతూ.. మీరు చేసిన అప్పులను మొస్తున్నాము. ప్రతీ మండలంలో ఒక మోడల్ హౌస్ నిర్మిస్తాం. డిజైన్ ఇలాగే ఉండాలని నియమం లేదు. మిడ్ మానేరు బాధితులకు మేము ఇండ్లు ఇచ్చాము. 7,8,9 తేదీలలో పెద్ద ఎత్తున తెలంగాణ పండుగ , సాంస్కృతిక వేడుక జరుగుతుంది. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఈ పండుగలో అందరూ భాగస్వాములు కావాలి. అసెంబ్లీలో చర్చలు చేసుకొని.. సమస్యలు పరిష్కరించుకుందాం’’ అని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.