
పూర్తయిన కేసీఆర్ పాస్‌పోర్ట్ రిన్యూవల్
బీఆర్ఎస్ రజతోత్సవ వేళ పార్టీ భవిష్యత్ కార్యాచారణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఆయన బుధవారం చేరుకున్నారు. తన పాస్‌పోర్ట్‌ను రిన్యూవల్ చేసుకోవడానికి ఆయన వెళ్లారు. ఆయన పాస్‌పోర్ట్ రిన్యూవల్ పూర్తయింది. అనంతరం ఆయన ఆక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత ఆయన తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ రజతోత్సవ వేళ పార్టీ భవిష్యత్ కార్యాచారణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీ ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా ఉన్నట్టుండి కేసీఆర్ తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేసుకోవడానికి రావడంతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయన విదేశీ పర్యటన ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. దేశం నుంచి ఉడాయించే ప్లాన్ కేసీఆర్ ఉన్నారని కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కాగా మరోవైపు ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా వైద్యం కోసం విదేశాలకు వెళ్లనున్నారని, అందుకోసమే ఉన్నపళంగా పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేసుకోవడానికి నిశ్చయించుకున్నారని వాదన వినిపిస్తోంది. అయితే హఠాత్తుగా కేసీఆర్.. పాస్‌పోర్ట్‌ను ఎందుకు రెన్యూవల్ చేసుకోవాల్సి వచ్చిందని? విదేశాలకు వెళ్లడానికే అయితే.. ఇన్నాళ్లూ బయటకు రాని వ్యక్తి ఇప్పటికిప్పుడు వేరే దేశానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చినట్లు? అన్న అనుమానాలు రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.