Kaushik Reddy | కౌశిక్ రెడ్డిని లాక్కెళ్లిన పోలీసులు.. ఎందుకంటే?
x

Kaushik Reddy | కౌశిక్ రెడ్డిని లాక్కెళ్లిన పోలీసులు.. ఎందుకంటే?

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. ప్రతి విషయంలో ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి.


కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. ప్రతి విషయంలో ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. హుజురాబాద్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్తా ఇద్దరి నేతల మధ్య ఘర్షణగా మారింది. ఈ సమావేశంలో మాట్లాడిన సంజయ్.. తమ ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యాలు చేశారు. దాంతో కౌశిక్ రెడ్డికి పట్టలేని కోపం వచ్చింది. వెంటనే పైకి లేచిన కౌశిక్.. నువ్వు ఏ పార్టీ? దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలివాలి? అంటూ ఛాలెంజ్ చేశారు. ఈ వివాదం కాస్తా చేయి చేసుకునే స్థాయికి చేరడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కలెక్టరేట్ నుంచి కౌశిక్ రెడ్డిని పంపించేశారు. అయితే బీఆర్ఎస్ తరపున గెలిచి పార్టీ ఫిరాయించిందే కాకుండా.. ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతుగా ఎలా మాట్లాడతారంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటనను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కౌశిక్ రెడ్డి ఎక్కడకుంటే అక్కడ వివాదాలే జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కౌశిక్ ఒక రైడీ: వెంకట్

‘‘పాడి కౌశిక్ రెడ్డి అచ్చోసిన ఆంబోతు లాగా ప్రవర్తిస్తున్నాడు. కౌశిక్ రెడ్డి ఒక రౌడీ, గుండా లాగా వ్యవరిస్తున్నాడు. మీడియాలో కనబడడం కోసమే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు రెండో విడత దళిత బంధు రావాలంటే నన్ను గెలిపిస్తేనే దళిత బంధు వస్తుందంటూ బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డాడు. దళితులను మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీయే. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, ఎస్సీ కార్పొరేషన్లకు నిధులివ్వకుండా మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా. కౌశిక్ రెడ్డి ఇలానే ప్రవర్తిస్తే రోడ్డుపై గుడ్డలూడదీసి కొట్టే రోజు వస్తుంది’’ అని హెచ్చరించారు.

నాపై దౌర్జన్యం చేస్తున్నారు: కౌశిక్ రెడ్డి

‘‘నా నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగింది. మిగిలిన 50శాతం కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశాను. కేసీఆర్ హయాంలో 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చాం. రెండో విడత దళిత బంధును కూడా విడుదల చేయాలని కోరాను. అందుకే నాపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. మీరు బెదిరిస్తే బెదిరేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ. మేము ఎట్టిపరిస్థితుల్లో అయినా రైతుల పక్షాన పోరాడతాం. రైతు భరోసా రూ.15వేలు ఇవ్వాల్సిందే. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారు. ఎమ్మెల్యే పదవి అనేది సంజయ్‌కి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై నిలబడి గెలివాలి’’ అని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి.

Read More
Next Story