కవితనై వస్తున్నానమ్మో! బీఆర్ఎస్ పని పడతానమ్మో!!
x

'కవిత'నై వస్తున్నానమ్మో! బీఆర్ఎస్ పని పడతానమ్మో!!

"సభ నుంచి వ్యక్తిగా వెళ్తున్నాను.. మళ్ళీ రాజకీయ శక్తిగా తిరిగి వస్తా"


తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఇవాళ (జనవరి 5) శాసనమండలిలో కంటతడిపెట్టారు. చాలా ఆవేదనతో, భావోద్వేగంతో కీలకాంశాలు చెప్పారు. తన సొంత పార్టీ (BRS) పైన, కేసీఆర్ తీరు పైన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రకటించారు.
పార్టీలో జరిగిన అవమానాలు..
-ఈడీ, సీబీఐ కేసులతో నేను పోరాడుతున్నప్పుడు పార్టీ నాకు అండగా ఉండలేదు.
-ప్రశ్నిస్తే కక్షగట్టారు. పార్టీలో తప్పులను ప్రశ్నించినందుకు నాపై కక్షగట్టారు. సొంత పార్టీలోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు, రాష్ట్రంలో ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు.

-అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ల నిర్మాణం వరకు అన్నింటిలో అవినీతి జరిగింది, ఆ విషయాన్ని గట్టిగా అడిగానని చెప్పారు.
-కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు.
-ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఉద్యమకారులకు పింఛన్లు ఇవ్వాలని కోరినా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే లక్ష్యాలను BRS విస్మరించింది.
-బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించమని కోరినా పట్టించుకోలేదు. ఈ ఫ్యాక్టరీని తెరిపించలేకపోవడం తన వ్యక్తిగత అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు.
-కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ నేతలెవరూ మాట్లాడలేదని, అందుకే తాను బయటకు వచ్చి నిజాలు చెప్పానని అన్నారు.
-కొత్త రాజకీయ శక్తిగా 'తెలంగాణ జాగృతి' అవతరిస్తుందన్నారు.
-"అవమాన భారంతో పుట్టింటి నుంచి (పార్టీ నుంచి) అన్ని బంధాలు తెంచుకుని మీ కోసం వస్తున్నాను" అని కవిత ప్రకటించారు.
-తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
-ఇది ఆస్తుల కోసం చేస్తున్న గొడవ కాదు, ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని చెప్పారు.
"సభ నుంచి వ్యక్తిగా వెళ్తున్నాను.. మళ్ళీ రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను" అని సవాల్ చేసి శాసనమండలికి రాజీనామా చేసి సభ నుంచి కన్నీళ్లు తుడుచుకుంటా బయటకువెళ్లారు.
Read More
Next Story