
జ్వాలాముఖి జీవిత సహచరి సీతాదేవి ఇకలేరు
సంప్రదాయ శ్రీ వైష్ణవ కుటుం బం నుంచి వచ్చిన సీతాదేవి జ్వా లాముఖి విప్లవ ఆదర్శలకు అనుగుణంగా కుటుంబాన్ని నడిపారు.
ప్రముఖ విప్లవ కవి, దిగంబర కవులలో ఒకరైన జ్వాలాముఖి జీవిత సహచరి సీతాదేవి (85) అనారోగ్యంతో సోమవారం ఉదయం అంబర్ పేటలోని తమ స్వగృహంలో కన్నుమూశారు. సీతాదేవి చాలా కాలంగా విపరీతమైన మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు. ఫలితంగా తీవ్రమైన జ్వరంతో లేవలే ని స్థితికి చేరుకున్నారు. వారి తమ్ముడు డాక్టర్ చారి పర్యవేక్షణలో ఆదివారం ఒక ఆస్పత్రిలో చికిత్స జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున డాక్టర్ చారి విమానంలో మరొక ప్రాంతానికి బయలుదేరారు. తమ్ముడు విమానం ఎక్కిన కాసేప టి కి సీతాదేవి కన్నుమూశారు.
జ్వాలాముఖి, సీతాదేవి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సంపత్, మూడవ కుమారుడు వాసు హైదరాబాదు లోనే ఉంటారు. రెండవ కుమారుడు శ్రీధర్ కొన్ని సంవత్సరాల ముందే కన్నుమూశారు. ముగ్గురి కొడుకుల పిల్లలు బాగా చదువుకుని స్థిర పడ్డారు. కొందరు విదేశాల్లో ఉన్నారు. ఒక సంప్రదాయ శ్రీ వైష్ణవ కుటుం బం నుంచి వచ్చిన సీతాదేవి జ్వా లాముఖి విప్లవ ఆదర్శలకు అనుగుణంగా కుటుంబాన్ని నడిపారు. వారిద్దరిదీ చాలా అన్యోన్య మైన దాంపత్యం. వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా భోజనం చేయమని బలవంతం చేసేవారు.
నేను మూడు సార్లు వారి ఇంటికి వెళ్లాను. చివరి సారిగా జ్వాల ముఖి ఆరోగ్యం బాగా దెబ్బతిన్న సమయంలో వెళ్లా ను. నేను వారి ఇంటికి వెళ్ళిన కొద్ది రోజులకే జ్వాలముఖి 2008 డిసెంబర్ 14 న కన్నుమూశారు. అప్పటినుంచి సీతాదేవి పెద్ద కుమారుడు సంపత్ కుటుంబముతోనే కలిసి జీవిస్తున్నారు. సీతాదేవి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 4 గంటలకు అంబర్ పేట శ్మశాన వాటిక లో నిర్వహించ నున్నట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.