నాలుగేళ్లుగా జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు, రిమాండ్ రిపోర్ట్
x

నాలుగేళ్లుగా జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు, రిమాండ్ రిపోర్ట్

మహిళా కొరియోగ్రాఫరుపై గత నాలుగేళ్లుగా డాన్స్ మాస్టర్ జానీ పలుసార్లు అత్యాచారం జరిపాడని నార్సింగి పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు.


డాన్స్ మాస్టర్ జానీకి అత్యాచారం కేసులో బాధితురాలికి మధ్య 2019వ సంవత్సరంలో పరిచయం ఏర్పడిందని నార్సింగి పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. దురుద్ధేశంతోనే జానీ బాధితురాలిని అసిస్టెంటుగా చేర్చుకున్నాడని పోలీసులు చెప్పారు.

- బాధితురాలు మైనరుగా ఉన్నపుడే 2020వ సంవత్సరంలో ముంబయిలోని ఓ హోటల్ లో తనపై జానీ మొదటిసారి అత్యాచారం జరిపాడని రిమాండు రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మొదటిసారి జానీ అత్యాచారం చేసినపుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు కావడంతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
- గడచిన నాలుగేళ్లలో తనపై పలుసార్లు జానీ అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. రేప్ విషయాన్ని ఫిర్యాదు చేస్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని జానీ బెదిరించారని తేలింది. జానీతో పాటు అతని భార్య కూడా బాధితురాలిని బెదరించింది.జానీ మాస్టర్ తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.


Read More
Next Story