USలో తెలుగు విద్యార్థి మిస్సింగ్, మిస్టీరియస్ డెత్
x

USలో తెలుగు విద్యార్థి మిస్సింగ్, మిస్టీరియస్ డెత్

అమెరికాలో భారతీయ విద్యార్థుల మిస్టరీ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అర్ఫత్ తో కలిపి 11 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.


మిస్సింగ్ కేసుగా నమోదైన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికా క్లీవ్‌ల్యాండ్‌ లోని ఒహైయో లో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. హైదరాబాద్‌లోని నాచారం కు చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేసేందుకు గత ఏడాది మేలో అమెరికా వెళ్ళాడు. అక్కడికి వెళ్లి సంవత్సరం కూడా తిరగకుండానే కుమారుడి చావు వార్త వినాల్సి రావడంతో అర్ఫత్ కుటుంబసభ్యులు తల్లడిలుతున్నారు.

అబ్దుల్ దాదాపు మూడు వారాలుగా కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు గత నెలలో న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. తాజాగా అతను మరణించాడని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.

అర్ఫత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అతని మరణంపై సమగ్ర దర్యాప్తు జరిగేలా స్థానిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ తెలిపింది. అతని మృత దేహాన్ని భారత్‌కు తరలించేందుకు మృతుని కుటుంబానికి అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నామని వెల్లడించింది.

అర్ఫత్ తనతో చివరిసారిగా మార్చి 7న మాట్లాడాడని, అప్పటి నుంచి అతను మాతో టచ్‌లో లేడని అర్ఫత్ తండ్రి మహ్మద్ సలీమ్ తెలిపారు. తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని వెల్లడించారు. యుఎస్‌లోని అర్ఫాత్ రూమ్ మేట్స్ కూడా అతని ఆచూకీ తెలియకపోవడంతో క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి, ఇండియాలోని అతని పేరెంట్స్ కి తెలియజేశారు.

మరోవైపు "అర్ఫాత్ ఆచూకీ కోసం స్థానిక చట్ట అమలు సంస్థలతో కలిసి పని చేస్తున్నాము" అని కాన్సులేట్ తెలిపింది. కానీ గాలింపు చర్యలు విషాదాంతంగానే ముగిశాయి.


ఇదిలా ఉండగా, మార్చి 19న అర్ఫాత్ కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది. అర్ఫాత్‌ను డ్రగ్స్ అమ్మే ముఠా కిడ్నాప్ చేసిందని, అతనిని వదిలేయాలంటే 1,200 అమెరికన్ డాలర్స్ చెల్లించాలని సదరు వ్యక్తి ఫోన్ లో USలో తెలుగు విద్యార్థి మిస్సింగ్, మిస్టీరియస్ డెత్

డిమాండ్ చేశాడు. లేదంటే అర్ఫాత్ కిడ్నీలు అమ్ముతానని ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడని అతని తండ్రి తెలిపారు. అయితే కాల్ చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశాడు కానీ పేమెంట్ మోడ్ గురించి చెప్పలేదు. దీంతో నేను నా కొడుకుతో మాట్లాడేందుకు అనుమతించమని కాల్ చేసిన వ్యక్తిని కోరగా, అతను నిరాకరించాడని సలీమ్ గత నెలలో హైదరాబాద్‌లో పిటిఐకి చెప్పారు.

ఈ నేపథ్యంలో అర్ఫాత్ మరణం మిస్టరీగా మారింది. నిజంగా కిడ్నాప్ కేసా లేక ఎవరైనా చంపి కిడ్నాప్ అని చిత్రీకరించేందుకు హంతకులు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, అమెరికాలో భారతీయ విద్యార్థుల మిస్టరీ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అర్ఫత్ తో కలిపి 11 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గతవారం క్లీవ్‌ల్యాండ్ లో మరణించిన ఉమా సత్య సాయి మృతికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగానే మరో విద్యార్థి మరణవార్త ఆందోళనకి గురి చేస్తోంది.

గతంలో మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో 34 ఏళ్ల ఇండియన్ క్లాసికల్ డాన్సర్ విషాదకరంగా చంపబడ్డాడు. ఇండియానాలో 23 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శవమై కనిపించాడు. ఇంకొక ఘటనలో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన 41 ఏళ్ల ప్రొఫెషనల్ వాషింగ్టన్‌లో దాడికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు.

ఈ వరుస సంఘటనలు విదేశాల్లో చదువుతున్న భారతీయుల భద్రతపై కుటుంబసభ్యుల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి.

Read More
Next Story