జీహెచ్ఎంసీలో తగ్గిన రూ.300కోట్ల నిర్మాణ పర్మిట్ల ఆదాయం
x

జీహెచ్ఎంసీలో తగ్గిన రూ.300కోట్ల నిర్మాణ పర్మిట్ల ఆదాయం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చిన ఆదాయం గణనీయంగా తగ్గింది.దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆదాయంపై దృష్టి సారించారు.


గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల ద్వారా జీహెచ్‌ఎంసీ ఆదాయం భారీగా పడిపోయింది. 2023-24వ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.300 కోట్ల ఆదాయం తగ్గిందని జీహెచ్ఎంసీ గణాంకాలే చెబుతున్నాయి.

- హైదరాబాద్ నగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు తగ్గుముఖం పట్టడంతో జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది.
- గత మూడు, నాలుగేళ్లతో పోలిస్తే నగరంలో భవన నిర్మాణ అనుమతులు, నివాసయోగ్యమైన పత్రాల జారీ ద్వారా వచ్చే రుసుము తగ్గింది.

తగ్గిన దరఖాస్తుల సంఖ్య
2024-25వ ఆర్థిక సంవత్సరంలో బహుళ అంతస్తుల భవనాల అనుమతుల కోసం దరఖాస్తుల సంఖ్య తగ్గడం వల్ల జీహెచ్ఎంసీకి రూ.300 కోట్ల ఆదాయం తగ్గింది.భవన నిర్మాణ అనుమతులపై వసూలు చేసే రుసుము గత సంవత్సరాల్లో పురపాలక సంఘం యొక్క పట్టణ ప్రణాళిక విభాగానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ రూ.1107.29 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జీహెచ్ఎంసీ 2023వ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 20వతేదీ వరకు భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 750 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.అంతకుముందు ఏడాది (2023-24)తో పోలిస్తే రూ.300 కోట్ల ఆదాయం తగ్గింది. హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగం మందగమనాన్ని సూచిస్తుంది. దీంతోపాటు భూముల రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా తగ్గింది. మొత్తం మీద రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది.

హైదరాబాద్ నిర్మాణ రంగంలో తిరోగమన ధోరణి
హైదరాబాద్ నగరంలో రెండో ఏడాది కూడా నిర్మాణ అనుమతుల ఆదాయం తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం గరిష్ట స్థాయికి చేరుకోగా, ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆదాయం తగ్గుముఖం పట్టింది.కోవిడ్ అనంతర సంవత్సరాల్లో నిర్మాణ పురోగతిని చూసిన హైదరాబాద్ నగరం, ప్రస్తుతం మందగమనాన్ని చూస్తోంది.


Read More
Next Story