పేమెంట్ యాప్స్ లో కరెంట్ బిల్లు కడుతున్నారా.. ముఖ్యమైన అలర్ట్
x

పేమెంట్ యాప్స్ లో కరెంట్ బిల్లు కడుతున్నారా.. ముఖ్యమైన అలర్ట్

ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్స్ కడుతున్నారా? ఇకపై అలా చేయడానికి కుదరదు.


ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్స్ కడుతున్నారా? ఇకపై అలా చేయడానికి కుదరదు. ఈ నెల నుంచి పేమెంట్ యాప్స్ నుంచి పవర్ బిల్ కట్టే వీలుండదు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ (TGSPDCL) సోమవారం కీలక ప్రకటన చేసింది. TGSPDCL వెబ్సైట్ నుండి కానీ మొబైల్ యాప్ నుండి కానీ బిల్ పేమెంట్ చేయాలని సూచించింది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు TGSPDCL విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని ఎక్స్ లో వెల్లడించింది.

ఒక్క సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర డిస్కంలకీ ఇదే పరిస్థితి. TGNPDCL, APSPDCL, APEPDCL, APCPDCL పరిధిలోని బిల్లులు చెల్లించడానికి ట్రై చేసినప్పుడు భారత్ బిల్లు పేమెంట్ సిస్టమ్ కి రిజిస్టర్ కాలేదని చూపిస్తోంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో కస్టమర్లపై ఎఫెక్ట్ పడనుంది. ఈ క్రమంలో సదరు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని వినియోగదారులు డిస్కమ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా పేమెంట్ చేయాల్సిందే.

ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి?

బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్ణయించింది. జులై 1 నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ని బిల్లర్స్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. దీనివల్ల ఆ యాప్స్ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు వీలు పడదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అదే జరిగింది.

Read More
Next Story