లై డిటెక్టర్ పరీక్షకైనా రెడీ.. ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ
x

లై డిటెక్టర్ పరీక్షకైనా రెడీ.. ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ

ఫార్ములా కేసులో కేటీఆర్‌ను ఈడీ ఈరోజు దాదాపు ఏడు గంటల పాటు విచారించింది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీ అంశంపై ఈడీ అధికారులు ఆరా తీశారు.


ఫార్ములా కేసులో కేటీఆర్‌ను ఈడీ ఈరోజు దాదాపు ఏడు గంటల పాటు విచారించింది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీ అంశంపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ఎవరి పర్మిషన్ లేకుండా విదేశీ సంస్థకు రూ.45.7 కోట్లు ఎందుకు బదిలీ చేశారు? అంత తొందర ఏమొచ్చిందని అనుమతులు తీసుకోలేదు? అన్న కోణాల్లో ప్రశ్నలు సంధించారు. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణ అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని చెప్పారు.

ఈడీ కూడా ఏసీబీ ప్రశ్నలే

ఈడీ తనను కొత్త ప్రశ్నలు ఏమీ అడగలేదని కేటీఆర్ వెల్లడించారు. ఏసీబీ ఏ ప్రశ్నలైతే అడిగిందో అవే ప్రశ్నలను ఈడీ అధికారులు కూడా అడిగారని తెలిపారు. ‘‘నేను లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం. రేవంత్ రెడ్డి సిద్ధమా. కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉంది. న్యాయమే గెలుస్తుంది. తప్పు చేయలేదు.. చేయబోను. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read More
Next Story