కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్
x

కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్

కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్టు రిపోర్ట్ లో పేర్కొంది.


కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్టు రిపోర్ట్ లో పేర్కొంది. హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చెరువుల్ని ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. భూమిని కబ్జా చేసి కట్టిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హైడ్రా కూల్చివేసిన నిర్మాణాలపై ఆ సంస్థ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది.

18 చోట్ల కూల్చివేతలు జరిపామని పేర్కొన్న హైడ్రా... మొత్తం 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ్ గోస్వామి కి చెందిన కట్టడాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజులరామారం, అమీర్ పేట్లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ లో హైడ్రా వెల్లడించింది.

Read More
Next Story