కాంగ్రెస్, మజ్లిస్ మైత్రీ బంధానికి ‘హైడ్రా’ దెబ్బ
x

కాంగ్రెస్, మజ్లిస్ మైత్రీ బంధానికి ‘హైడ్రా’ దెబ్బ

కాంగ్రెస్ పార్టీ,మజ్లిస్ పార్టీల మధ్య మైత్రీ బంధానికి ‘హైడ్రా’ దెబ్బ తగిలిందా? అంటే అవుననిపిస్తోంది మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రొటెం స్పీకరుగా అక్బరుద్దీన్ ఒవైసీని చేశారు. అనంతరం జరిగిన అధికారిక కార్యక్రమాల్లో మజ్లిస్ బిగ్ బ్రదర్స్ అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీల కు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు.

- మూసీ నదీ తీరాన్ని లండన్ నగరంలోని థేమ్స్ నదిలా తీర్చిదిద్దేందుకు ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ సర్కారు ప్రారంభించింది. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మజ్లిస్ శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీని వెంట తీసుకొని లండన్ నగరంలో థేమ్స్ నదిని సందర్శించారు.
- మూసీ ప్రాజెక్టుతోపాటు పాతబస్తీలో మెట్రోరైలు శంకుస్థాపన, మీరాలం ట్యాంకు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ శంకుస్థాపన, హైదరాబాద్ నగర అధికారిక సమీక్షా సమావేశాల్లోనూ సీఎం అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అధికార కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మైత్రీ బంధం ఏర్పడింది.

హైడ్రా కూల్చివేతలే మజ్లిస్ ఆగ్రహానికి కారణం
తాజాగా హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా దెబ్బతో అధికార కాంగ్రెస్, మజ్లిస్ పక్షాల నేతల మధ్య విబేధాలు రాజుకున్నాయి. భంరుక్ దౌలా చెరువు ప్రాంతంలో మజ్లిస్ నేతలు నిర్మించిన పలు భవనాలను హైడ్రా కూల్చివేసింది. బహదూర్ పురా మజ్లిస్ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ కు చెందిన భవనాలను కూడా హైడ్రా కూల్చింది. మజ్లిస్ నేతలే కాకుండా ఆ పార్టీకి చెందిన చోటా మోటా నేతలు, కార్యకర్తల భవనాలపై హైడ్రా బుల్డోజర్లు నడిపింది.
రాజేంద్ర నగర్ లోని భుమ్రుఖ్ దౌలా చెరువు ప్రాంతాన్ని కబ్జా చేసి నిర్మించిన 45 భవనాలను తొలగించారు. బహదూర్ పుర ఎంఐంఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం పార్టీకే చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ కు చెందిన భవనాలను కూల్చివేయడం మజ్లిస్ పార్టీ ఆగ్రహానికి కారణమైంది.

గరీబోళ్ల ఇళ్లు కూల్చొద్దు :ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
‘‘మీరు తాజ్ మహల్ నిర్మించాలంటే నిర్మించుకోండి కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి గరీబ్ గాళ్లకు ఇబ్బందులు పెట్టవద్దు, వారి ఇళ్లను కూల్చవద్దు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలకు ప్రజలు ఓట్లు వేశారు, మీరు ఆరు గ్యారంటీలు నెరవేర్చండి, ఎఫ్టీఎల్ మాట చెబుతున్నారు. కొత్త సెక్రటేరియెట్ హుసేన్ సాగర్ కట్టమీద నిర్మించారు , పెద్ద పెద్ద నేతల సమాధులు హుసేన్ సాగర్ ఎఫ్టీఎల్ ఉన్నాయి. సెక్రటేరియెట్ హుసేన్ సాగర్ తీరంలో ఉండవచ్చుకానీ, పేదవాడి ఇల్లు ఉండవద్దా?’’ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.‘‘హుసేన్ సాగర్ తీరంలోని సచివాలయంలో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, కానీ సాగర తీరంలోని ఇళ్లలో మన అమ్మ ఎందుకు ఉండకూడదు, పేదవాళ్లకు ఏమిటీ అన్యాయం’’ అని ఎంపీ ఎక్స్ లో పోస్టు చేశారు.



మజ్లిస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య బాహాబాహీ

నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుసేన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ల మధ్య రగడ రాజుకుంది. వారి అనుచరులు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. విజయనగర్ కాలనీ డివిజన్ లో సీసీ రోడ్డు పనులను పరిశీలించేందుకు ఫిరోజ్ ఖాన్ వచ్చారు. ఎంఐఎం నేతలపై ఫిరోజ్ ఖాన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆ పార్టీ ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ కు కార్యకర్తలు చెప్పడంతో ఆయన విజయనగర్ కాలనీకి వచ్చారు. ఫిరోజ్ ఖాన్, మాజిద్ హుసేన్ లతోపాటు మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దూషించుకుంటూ గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు రాళ్లు కూడా రువ్వుకున్నారు. పోలీసులు వచ్చి రెండు వర్గాలకు సర్ది చెప్పి పంపించి వేశారు.



Jab Hyderabad ka Secretariat FTL (Full Tank Level) mein bankar barqaraar rah sakta hai to ghareeb ka ghar kyo'n nahi rah sakta? pic.twitter.com/Hj5AlSGFlU





Read More
Next Story