
హైదరాబాద్ హలీమ్ : జీఐ ట్యాగ్ వచ్చి 15 ఏళ్లు
హైదరాబాద్ హలీంకు జీఐ ట్యాగ్ వచ్చి 15 సంవత్సరాల వేడుకలు
అంతర్జాతీయఖ్యాతి గడించిన హైదరాబాద్ హలీమ్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చి నేటికి 15 ఏళ్లు అయింది.హలీమ్ ఈ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది.
హైదరాబాద్ హలీమ్ కు భౌగోళిక సూచిక (జీఐ ట్యాగ్) వచ్చి 15 ఏళ్లు గడచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ హలీమ్ తయారీదారుల అసోసియేషన్ ప్రతినిధులు వేడుకలు జరుపుకుంటున్నారు.(15 Years GI Tag) జీఐ ట్యాగ్ లభించడం ద్వారా హైదరాబాద్ హలీమ్ కు (Hyderabad Haleem)అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఐకానిక్ హోదా లభించడంతోపాటు హైదరాబాద్ హలీమ్ పాక చిహ్నంగా గుర్తింపు లభించింది. హైదరాబాద్ నగరంలో హలీమ్ లేకుండా రమజాన్ నెల పూర్తి కాదని, ముస్లింలే కాకుండా ఎందరో హిందువులు, క్రైస్తవులు, ఇలా అన్ని మతాల వారు కూడా ఈ హలీమ్ రుచి చూస్తుంటారు.
హలీమ్ ఖ్యాతిని కాపాడుకోవాలి
హైదరాబాద్ హలీమ్ కు జీఐ ట్యాగ్ ద్వారా వచ్చిన అంతర్జాతీయ ఖ్యాతిని కాపాడుకోవాలని ప్రముఖ జీఐ ప్రాక్టీషనర్ సుభాజిత్ సాహో చెప్పారు. హలీమ్ నాణ్యత, ఖ్యాతిని కాపాడుకునేందుకు సుగంధ ద్రవ్యాలు, మిరపకాయలు, గోధుమలను చేర్చడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది రమజాన్ నెలలో హలీమ్ విక్రయాలు వెయ్యి కోట్ల రూపాయల టర్నోవరుకు చేరుకున్నాయని (Sales Turnover Rs.1000 Crore)హైదరాబాద్ నగరానికి చెందిన హలీం వ్యాపారి మాజిద్ అఫ్సర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
విదేశాలకు ఎగుమతి
హైదరాబాద్ హలీమ్ కు జీఐ ట్యాగ్ లభించడం ద్వారా దీని పేరుప్రఖ్యాతలు విదేశాల్లోనూ మార్మోగుతున్నాయి. అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, పశ్చిమాసియా దేశాలకు హలీమ్ ఎగుమతులు పెరిగాయి. ఈ ఎగుమతుల వల్ల హైదరాబాదీ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని పాత బస్తీకి చెందిన ఇస్తామిక్ రచయిత ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
మరో 10 కొత్త ఉత్పత్తులకు జీఐ ట్యాగ్
తెలంగాణ రాష్ట్రంలో మరో పది కొత్త ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది పది కొత్త ఉత్పత్తులకు జిఐ హోదా కోసం దాఖలు చేయాలని యోచిస్తోంది.రాష్ట్రంలోని వ్యవసాయ, హస్తకళల వారసత్వాన్ని హైలైట్ చేయడం ద్వారా జీఐ ట్యాగ్ లు సాధించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణలో 17 జీఐ ట్యాగ్ నమోదిత ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 27కి పెరుగుతాయని భావిస్తున్నారు.
హైదరాబాద్ ముత్యాలు, బంజారా గిరిజన ఆభరణాలు...
జీఐ ఫైలింగ్ కోసం గుర్తించిన ఆరు కొత్త హస్తకళలు,సాంస్కృతిక ఉత్పత్తుల్లో హైదరాబాద్‌కు చెందిన ముత్యాలు, నిజామాబాద్‌కు చెందిన ఆర్మూర్ పసుపు, నారాయణపేటకు చెందిన ఆభరణాల తయారీ క్రాఫ్ట్, మెదక్ జిల్లా నుంచి బాటిక్ పెయింటింగ్, నల్గొండ నుంచి బంజారా నీడిల్‌క్రాఫ్ట్, బంజారా గిరిజన ఆభరణాలు ఉన్నాయి. మరో వైపు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నాలుగు వ్యవసాయ ఉత్పత్తులకు జీఐ గుర్తింపు పొందేందుకు కృషి చేస్తోంది. వీటిలో బాలానగర్ సీతాఫలం, నల్గొండ దోసకాయ (ఓరియంటల్ పిక్లింగ్ మెలోన్), అనబ్-ఎ-షాహీ ద్రాక్ష, ఖమ్మం మిరపకాయలు ఉన్నాయి.
Next Story