కేటీఆర్ న్యాయవాదికి హైకోర్టు పాక్షిక అనుమతి
x

కేటీఆర్ న్యాయవాదికి హైకోర్టు పాక్షిక అనుమతి

మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన లంచ్ మోషన్ పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.


మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలో తనతో పాటు తన న్యాయవాదిని కూడా అనుమతించాలంటూ కేటీఆర్.. బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం దానిపై విచారణ జరిపింది. ఈ కేసులో కేటీఆర్ తరపున న్యాయవాది ప్రభాకర్ రావు వాదనలు వినిపించగా, ఏసీబీ తరపున అడ్వొకేట్ జనరల్ తేరా రంజిత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. కేటీఆర్‌కు సానుకూలంగా తీర్పునిచ్చింది. కేటీఆర్‌తో పాటు న్యాయవాదిని కూడా విచారుణకు అనుమతించాలని తెలిపింది. దీంతో కేటీఆర్‌ రేపు ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలో తన న్యాయవాదిని కూడా వెంట తీసుకెళ్లడానికి మార్గం సుగమం అయింది.


న్యాయవాదుల వాదనలిలా..

కోర్టులో విచారణ ప్రారంభం కాగా కేటీఆర్ తరపు న్యాయవాది ప్రభాకర్ రావు బలమైన వాదనలు వినిపించారు. డిజేబుల్ డిస్టెన్స్‌లో ఉండేలా అనుమతి ఇవ్వాలని, గతంలో సుప్రీంకోర్టు సైతం ఓ కేసులో న్యాయవాదికి అనుమతి ఇచ్చిందని ఆయన వివరించారు. కాగా అడ్వొకేట్ జనరల్ రంజిత్ రెడ్డి మాత్రం.. కేటీఆర్ అభ్యర్థనను తిరస్కరించాలని, ఏసీబీ విచారణకు న్యాయవాదని అనుమతించడానికి ఆమోదం తెలపొద్దని కోరారు. కాగా విచారణలో న్యాయవాది పాల్గొంటే తప్పేంటి? వచ్చే నష్టం ఏంటి? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిందితుడు, అధికారి ఒక గదిలో ఉంటే వాళ్లు కనిపించే దూరంలో మరోగదిలో న్యాయవాది ఉంటారని, కేటీఆర్ తన వెంట తీసుకెళ్లే న్యాయవాది పేరు చెప్పాలని న్యాయమూర్తి సూచించారు. ముగ్గురు న్యాయవాదుల పేర్లు చెప్పాలని, వారిలో ఒకరు కేటీఆర్ వెంట వెళ్లాలని న్యాయస్థానం తెలిపింది. దర్యాప్తు అధికారి, పిటిషనర్ కనిపించే విధంగా ఏసీబీ కార్యాలయంలో ఏర్పాట్లు ఉన్నాయా అని కూడా ఏఏజీని కోర్టు ప్రశ్నించింది.అనంతరం ఈ పిటిషన్ విచారణను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది.

వీడియో రికార్డింగ్‌కు నిరాకరణ

కొద్దిసేపటికే తిరిగి ప్రారంభమైన విచారణలో భాగంగా కేటీఆర్ ఏసీబీ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్‌కు న్యాయస్థానం నిరాకరించింది. అయితే కేటీఆర్ వెంట ఏసీబీ విచారణకు న్యాయవాది రామచంద్రరావు హాజరవుతారని అడ్వకేట్ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయస్థానం అధిగిన ప్రశ్నలకు ఏఏజీ సమాధానం ఇచ్చారు. న్యాయవాది లైబ్రరిలీ కూర్చుంటే విచారణ అధికారి, కేటీఆర్ ఇద్దరూ కనిపిస్తారని తెలిపారు. దీంతో న్యాయవాదితో కలిసి గురువారం ఏసీబీ విచారణకు హారవ్వాలని కేటీఆర్‌కు న్యాయస్థానం సూచించింది. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే న్యాయస్థానాన్ని మళ్ళీ ఆశ్రయించవచ్చని హైకోరటు తెలిపింది.

Read More
Next Story