గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు ఝలక్
x

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు ఝలక్

గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. వారి పిటిషన్‌ను కొట్టేసింది.


గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఇప్పటికే పరీక్షలు జరిగినందునే రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చే వరకు పరీక్ష ఫలితాలను ఆపాలంటూ గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం దానిని కొట్టివేసింది. జీవో 29 సహా పలు అంశాలపై ఈ పిటిషన్‌లో గ్రూప్-1 అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. కానీ అందుకు సీఎం రేవంత్ రెడ్డి నిరాకరించారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయని తేల్చి చెప్పారు. దీంతో వారు హైకోర్టు ఆశ్రయించగా.. హైకోర్టు కూడా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పేసింది. ఆఖరిని నిమిషంలో గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. కాగా చివరి నిమిషయంలో పరీక్షలను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో షెడ్యూట్ ప్రకారం.. గ్రూప్-1 పరీక్షలు జరిగాయి.

ఇప్పటికీ రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోవడంతో గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాలని, ఆ తర్వాత నియామకాలు చేపట్టాలని కోరారు. ఆ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చే వరకు గ్రూప్-1 పరీక్షల ఫలితాలను విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ విషయంలో కూడా అభ్యర్థులకు చుక్కెదురైంది. ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

ఇదిలా ఉంటే గ్రూప్ -1 పరీక్ష నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఇప్పటి వరకూ మూడు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. 2022 లో అక్టోబర్ 16 న మొదటి సారి పరీక్ష నిర్వహించి, 1:50 నిష్ఫత్తిలో 25 వేల మందితో 2023 జనవరిలో మెయిన్స్ జాబితాను విడుదల చేసింది. అయితే మార్చిలో కమిషన్ ఉద్యోగులు పేపర్ లీక్ చేసినట్లు తేలడంతో జూన్ లో జరగాల్సిన మెయిన్స్ ను రద్దు చేసింది. తరువాత అదే సంవత్సరంలో రెండో సారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే సరియైన నిబంధనలు పాటించలేదన్న కారణంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ పరీక్షను సైతం రద్దు చేసింది. ఈ పరిణామంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి అదనంగా మరో 60 పోస్టులను జతచేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా అందరూ తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతకుముందే కమిషన్ ను సంస్కరించింది. కొత్త ఉద్యోగులకు నియమించింది. సుప్రీంకోర్టు లో తానే దాఖలు చేసిన కేసును కమిషన్ విత్ డ్రా చేసుకుంది. ఈ ఏడాది జూన్ లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన కమిషన్, అక్టోబర్ నుంచి మెయిన్స్ పరీక్ష నిర్వహించడానికి సిద్దమైంది. అయితే తుది కీలో సరియైన జవాబులు లేవని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరపిన న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టి వేసింది.

Read More
Next Story