రేవంత్‌ది రాతి గుండె.. మరోసారి మండిపడ్డ హరీష్ రావు
x

రేవంత్‌ది రాతి గుండె.. మరోసారి మండిపడ్డ హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ది రైతు గుండె అయితే రేవంత్‌ది రాతి గుండే అంటూ చురకలంటించారు.


సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ది రైతు గుండె అయితే రేవంత్‌ది రాతి గుండే అంటూ చురకలంటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం అయ్యాయని, వాటి అమలుకు సీఎం రేవంత్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేసిన ఘనతను మూట గట్టుకున్న తొలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రభుత్వం వస్తే సంబరాలు చేసిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఆ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలకు, మోసాలను అడ్డుకోవాలని, పేదలను న్యాయం జరిగే చర్యలు తీసుకోవాలని కూడా హరీష్ రావు కోరారు. తొర్రూరులో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో లెక్కాపత్తా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం జరిగిలే తెలంగాణ కాంగ్రెస్‌కు ఆదేశాలివ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లెంగాణ అంధకారం వైపు అడుగులు వేయడం మొదలు పెట్టిందని, రైతు కంట కన్నీరు ప్రారంభమైందంటూ మండిపడ్డారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకుని మరో చేత్తో రౌడీ ఇజం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి.

రేవంత్ మొనగాడు కాదు మోసగాడు..

‘‘రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేశారు రేవంత్. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని అందరు దేవుళ్లపై ఒట్టు పెట్టి.. చేయకుండా మోసగాడిగా ముద్ర వేసుకున్నారు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు మోసగాడు. రుణమాఫీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ 31 కుంటి సాకులు చెప్తూ దాటేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారు. మూసీ ప్రక్షాళన అంటూ పేదోళ్లను రోడ్డుకీడుస్తున్నారు. పేదల ఇళ్లు కూలుస్తామంటూ బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయడానికి రేవంత్ రెడ్డికి దసరా వరకు సమయం ఇస్తున్నాం. దసరాకు అందరు రైతుల రుణాలు మాఫీ కాకుంటే ఉద్యమం చేస్తాం’’ అని హెచ్చరించారు.

రేవంత్ పాలన అంతా తుస్సే..

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిన వదిలి పెట్టమని హరీష్ రావు మండిపడ్డారు. ఒక్క ఉచిత బస్సు తప్పా ఈ ప్రభుత్వ పాలన అంతా కూడా తుస్సే అంటూ చురకలంటించారు. ‘‘రైతులు చనిపోతున్నా రేవంత్‌కు పట్టట్లేదు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే డైవర్షన్ పాలిటిక్స్ రన్ చేస్తున్నారు. రైతులు మాత్రం వాటిని పట్టించుకోకండి. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కనిపిస్తే వారిని నిలదీయండి. రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్ రన్ చేస్తున్నారు. రేవంత్ గూండాగిరి చేస్తూ బీఆర్ఎస్ చేతులు కట్టుకుని కూర్చోదు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

రుణమాఫీ అంతా డొల్ల మాటలే: కేటీఆర్

అయితే రైతు రుణమాఫీ తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతుంటే.. తాము ఎవరినీ మోసం చేయలేదని, ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్తోంది. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ అంటూ చేసిన వ్యాఖ్యలన్నీ డొల్ల మాటలే అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘‘వంద శాతం రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి పలుకులన్నీ డొల్ల మాటలేనని మరోసారి తేలిపోయింది. డిసెంబర్ 9న ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి దగా చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు పూర్తయినా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిందన్న సీఎం మాటలు నయవంచన కాక మరేంటి. ఈ 20 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి. అధికారిక లెక్కల ప్రకారమే మోసపోయిన రైతుల సంఖ్య 20 లక్షలుగా ఉంటే.. అనధికారికంగా ఇంకెందరు ఉన్నారో. ఇప్పటికి కూడా రుణమాఫీని పూర్తి చేయలేదీ ప్రభుత్వం. రైతు బంధును కూడా అటకెక్కించేశారు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

Read More
Next Story