హరీష్ నుంచి సలహాలు తీసుకోవడానికి రెడీ.. కీలకంగా మారిన పొన్నం వ్యాఖ్యలు
x

హరీష్ నుంచి సలహాలు తీసుకోవడానికి రెడీ.. కీలకంగా మారిన పొన్నం వ్యాఖ్యలు

విపక్ష నేత హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభావకర్ ప్రశంసలు చేశారు. హరీష్ రావు తమ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చని అన్నారు.


విపక్ష పార్టీ నేతను ప్రశంసించడం మన తెలంగాణ రాజకీయాలలోనే కాదు భారతదేశ రాజకీయాల్లోనే చాలా అరుదు. ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తే వాటిని రాజకీయ హుందా తనానికి నాందికిగా పలుకుతారు. ఇటువంటి ఘటనే ఒకటి ఈరోజు తెలంగాణలో జరిగింది. విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. హరీష్ రావు చాలా హార్డ్ వర్కర్ అని, ఆయన మాకు సలహాలు ఇవ్వొచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఆయన హార్డ్ వర్కర్ అంటూనే మరోవైపు హరీష్ తన ప్రశ్నలకు తానే సమాధానం ఇవ్వాలని కూడా వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్‌కు వచ్చిన నీళ్లు కాళేశ్వరంవా? లేక ఎల్లంపల్లివా? అనేది హరీష్ రావే వివరించాలని కోరారు. అదే సమయంలో ఇరిగేషన్ మాజీ మంత్రిగా ఆయన తమకు సలహాలు ఇవ్వొచ్చని, ఆయన సలహాలను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

మాకు రాజకీయం ముఖ్యం కాదు

‘‘హరీష్‌ రావు కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. మాకు రాజకీయం ముఖ్యం కాదు. రైతులకు నీళ్లు అందించడమే కీలకం. హరీష్ ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇవ్వాలి. మల్లన్నసాగర్‌కు వచ్చిన నీళ్లు ఎక్కడివని హరీస్‌నే అడుగుతున్నాం. ఆయనే సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్ చేయడానికి హరీష్‌ రావు శతవిధాలా శ్రమిస్తున్నారు. ఏది ఏమైనా ఇరిగేషన్ మాజీ మంత్రిగా ప్రభుత్వానికి హరీష్ రావు సలహాలు ఇవ్వొచ్చు. సూచనలు కూడా చేయొచ్చు. మేము వాటిని స్వీకరిస్తాం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే పూర్తి చేశారు. ఆ ప్రాజెక్ట్ ప్రారంభానికి ఆయన కూడా వస్తానంటే హెలికాప్టర్ పేల్చేస్తానని కిరణ్‌ను హెచ్చరించా’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మూసీ నది ప్రక్షాళన గురించి కూడా మాట్లాడారు.

మూసీ ఆక్రమణలపై ఫుల్ ఫోకస్

మూసీనది ప్రక్షాళకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జరిగిన అన్ని ఆక్రమణలపై దృష్టి సారిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం నిర్మించి గాలికి వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు కేటాయించడానికి సన్నాహాలు చేస్తున్నామని, ముసీ నది పరివాహక ప్రాంతంలో సుమారు 12వేల ఆక్రమణలు జరిగినట్లు గుర్తించినట్లు ఆయన వివరించారు. నదీ ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఈ ఆక్రమణలను తొలగించే పనులను ప్రభుత్వం హైడ్రాకు అందించిందని చెప్పారు.

Read More
Next Story