రాజీనామా లేఖ ఇచ్చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
x

రాజీనామా లేఖ ఇచ్చేసిన మాజీ మంత్రి హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసినట్టే మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకి వచ్చారు. రాజీనామా లేఖని గవర్నర్ కి ఇవ్వాలంటూ జర్నలిస్టులని కోరారు.


సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసినట్టే మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకి వచ్చారు. తన రాజీనామా లేఖని గవర్నర్ కి ఇవ్వాలంటూ జర్నలిస్టులని కోరారు. దమ్ముంటే సీఎం రేవంత్ కూడా తన సవాల్ ని స్వీకరించగలన్నారు. ఆయన రావడానికి మొహమాటంగా ఉంటె కనీసం పీఏ తో అయినా తన రాజీనామా లేఖని పంపించాలని సూచించారు.

కొద్దీ రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య సవాల్ ప్రతి సవాళ్ల వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. హరీష్ రావు రుణమాఫీ అంశంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావులకు ఓ ఛాలెంజ్ చేశారు. "ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసే బాధ్యత నాది. అలా చేస్తే నీ మామ బీఆర్ఎస్ పార్టీ ని రద్దు చేస్తాడా? నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా" అంటూ హరీష్ రావుకి సవాల్ విసిరారు.

దీనిపై హరీష్ రావు కూడా సూటిగానే స్పందించారు. రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్టు చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డికి ప్రతిసవాల్ చేశారు. "మీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, రుణమాఫీ ఆగస్టు 15 లోపల అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, అలా చేయకుంటే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని ఛాలెంజ్ చేశారు". అంతేకాదు, శుక్రవారం అమరవీరుల స్థూపం వద్ద దీనిపై చర్చించుకుందామని, అక్కడే ప్రమాణం చేద్దామని, నేను రాజీనామా లేఖతో వస్తాను, నువ్వు కూడా రాజీనామా లేఖతో రావాలని డిమాండ్ చేశారు.


చెప్పినట్టుగానే శుక్రవారం ఉదయం హరీష్ రావు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకి చేరుకున్నారు. ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తర్వాత తన రాజీనామా లేఖని జర్నలిస్టులకి చూపించారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే జర్నిలిస్టులు, మేధావులు కలిసి తన రాజీనామా లేఖని గవర్నర్ కి ఇస్తారని, రాజీనామా లేఖని వారి చేతుల్లో పెడుతున్నానని అన్నారు.

దమ్ముంటే రేవంత్ రెడ్డి కూడా తన సవాల్ ని స్వీకరించాలన్నారు. తను రావడానికి మొహమాటంగా ఉంటే పీఏతో కానీ, స్టాఫ్ తో కానీ రాజీనామా లేఖని పంపించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోగా ఏకకాలంలో రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు (13 హామీలు) అమలు చేయాలన్నారు. "కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసింది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పింది. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హరీష్ రావు రేవంత్ రెడ్డికి సూచించారు.


హరీష్ రావు రాజీనామా లేఖ


Read More
Next Story