ముగిసిన తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్..
x

ముగిసిన తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్..

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఈరోజు జరిగాయి.


తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఈరోజు జరిగాయి. జీవో29 రద్దు, మెయిన్స్ పరీక్షల రద్దును డిమాండ్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తున్నారు. వారికి ప్రతిపక్ష పార్టీలయిన బీజేపీ, బీఆర్ఎస్‌లు పూర్తి మద్దతు ఇచ్చాయి. ఇదే విధంగా గ్రూప్-1 అభ్యర్థులు తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టు వారి పిటిషన్‌ను రద్దు చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్టోబర్ 21 సోమవారం నాడు విచారణ జరిపి తాము ఈ అంశంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. దీంతో సోమవారం రోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి.

తొలిరోజు పరీక్షకు 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే 46 పరీక్ష కేంద్రాల వద్ద కూడా ఒక్కనిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోనికి అనుమతించలేదు అధికారులు. అనుమతించడం కుదరదని, ఒకవేళ లోపలికి వెళ్లనిస్తే తాము పై అధికారులకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని వారు వివరించారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 21 సాయంత్రానికి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తొలిరోజు విజయవంతంగా ముగిసింది. భారీ భద్రత మధ్య ఈ పరీక్ష ముగిసింది. హైదరాబాద్ జిల్లాలో 5,613 మంది హాజరుకావాల్సి ఉండగా 4,896 మంది మాత్రమే హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 87.23 శాతం అభ్యర్థులు హాజరయ్యారని ఆర్డీఓ జైపాల్ రెడ్డి వెల్లడించారు.

గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏమందంటే..

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయడానికి నిరాకరించిన న్యాయస్థానం పరీక్ష నిర్వహణలో తాము జోక్యం చేసుకోదలచుకోవడం లేదంటూ స్పష్టం చేసింది. దాంతో ఈ విషయంలో హైకోర్టు నిర్ణయానికే మద్దతు ఇస్తున్నట్లు వివరించారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలు స్పష్టం చెప్పిందని వివరించారు. అంతేకాకుండా పరీక్ష జరుగుతున్నప్పుడు, అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో ఉన్న సమయంలో ఈ విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని కూడా ధర్మాసనం వెల్లడించింది. అంతేకాకుండా గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల కాకముందే ఈ అంశంతో తుది విచారణను ముగించాలంటూ హైకోర్టుకు ఆదేశించింది సుప్రీంకోర్టు.

పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

అయితే గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ విద్యార్థులు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణలో హైకోర్టు.. ప్రభుత్వానికే మద్దతుగా తీర్పునిచ్చింది. విద్యార్థుల పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయించినట్లు పరీక్షలు యథావిధిగా జరుగుతాయిన స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆలోచిస్తున్నారు. కాగా సుప్రీంకోర్టుకు విద్యార్థులు వెళితే అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులకు కాస్తంత బూస్ట్ వచ్చినట్లయింది. మరి వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది చూడాలి.

అసలు వివాదం ఏంటంటే

మార్చిలో కమిషన్ ఉద్యోగులు పేపర్ లీక్ చేసినట్లు తేలడంతో జూన్ లో జరగాల్సిన మెయిన్స్ ను రద్దు చేసింది. తరువాత అదే సంవత్సరంలో రెండో సారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే సరియైన నిబంధనలు పాటించలేదన్న కారణంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ పరీక్షను సైతం రద్దు చేసింది. ఈ పరిణామంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి అదనంగా మరో 60 పోస్టులను జతచేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.

కొత్తగా అందరూ తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతకుముందే కమిషన్ ను సంస్కరించింది. కొత్త ఉద్యోగులకు నియమించింది. సుప్రీంకోర్టు లో తానే దాఖలు చేసిన కేసును కమిషన్ విత్ డ్రా చేసుకుంది. ఈ ఏడాది జూన్ లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన కమిషన్, అక్టోబర్ నుంచి మెయిన్స్ పరీక్ష నిర్వహించడానికి సిద్దమైంది. అయితే తుది కీలో సరియైన జవాబులు లేవని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కొన్ని రోజులుగా విచారణ జరుపుతున్న న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టి వేసింది.

Read More
Next Story