KCR FARM HOUSE | మనవడికి సేద్యం నేర్పిస్తున్న కేసీఆర్
కేసీఆర్ తన మనవడితో మొక్క చుట్టూ పారతో మట్టి తీయించి పాదు చేసి నీళ్లు పోయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎర్రవెల్లిలోని తన తాత కేసీఆర్ ఫాంహౌస్‌లో మనవడైన కల్వకంట్ల హిమాన్షురావు పార చేత బట్టి వ్యవసాయ పనులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తెలంగాణ ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ కు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేయించారు.
- గజ్వేలు ఎమ్మెల్యేగా,రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలోనే కాలం గడుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఫాంహౌస్ లోనే ఉంటున్న కేసీఆర్ తాజాగా తన మనవడు హిమాన్షు రావుకు దగ్గరుండి పండ్ల మొక్కచుట్టూ పారతో మట్టి తీయించి, నీళ్లు పోశారు. కేసఆర్ తలపై టోపీ పెట్టుకొని మనవడికి పండ్ల మొక్కల సాగు ఎలా చేయాలనేది నేర్పిస్తుండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
- ‘‘వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అటవీకరణ చాలా అవసరం, మన సహజ వనరులను సంరక్షించడం మన బాధ్యత’’అని హిమాన్షురావు ఎక్స్ లో పేర్కొన్నారు. సాగు విధానాల్లో ఉత్తమమైన వాటిని నేర్చుకుంటున్నానని హిమాన్షు రావు కల్వకుంట్ల ట్వీట్ లో పేర్కొన్నారు. లెర్నింగ్ ఫ్రం ది బెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు.
Next Story