తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. 2022 జులై నుంచి డీఏ రివిజన్ చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త వెల్లడించింది. డీఏను పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జీఓఎంఎస్ నంబరు 120 పేరిట విడుదల చేసింది. 2022 జులై 1వతేదీ నుంచి తెలంగాణలో బేసిక్ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు డీఏ 3.64 శాతం పెంచారు.పెరిగిన డీఏ నవంబరు జీతంతో కలిపి చెల్లించనున్నారు.
- వచ్చే ఏడాది మార్చి 31వతేదీ లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలను 17 వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సీసీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలను 10శాతం ప్రాన్ ఖాతాకు మళ్లిస్తారు. ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
- జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థ, వర్క్ చార్జెడ్ ఎష్టాబ్లిష్ మెంట్ ఉద్యోగులకు డీఏ పెరగనుంది.
- ఎయిడెడ్ విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు డీఏ పెరగనుంది. పాలిటెక్నిక్ ఉద్యోగులకు డీఏ పెంచనున్నారు.
Next Story