అధికారం పోతే పరిస్ధితి ఇలాగే ఉంటుంది
x

అధికారం పోతే పరిస్ధితి ఇలాగే ఉంటుంది

జగన్ ఇంటిముందున్న పోలీసు సెక్యూరిటి నిర్మాణాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కూల్చేసింది.


జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ ఇంటిముందున్న పోలీసు సెక్యూరిటి నిర్మాణాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కూల్చేసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం లోటస్ పాండ్ ఇంటికి ఎదురుగా సెక్యూరిటి సిబ్బంది ఉండేందుకు నిర్మాణాలు చేశారు. జగన్ లోటస్ పాండ్ కు వచ్చినా రాకపోయినా పోలీసు సెక్యూరిటి అయితే తప్పదు కాబట్టి భద్రతాసిబ్బంది ఆ నిర్మాణాల్లోనే ఉండేవారు.

ఈమధ్యనే జరిగిన ఎన్నికల్లో జగన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. జగన్ అమరావతిలోనే ఉన్నా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వచ్చినా పెద్దగా తేడా ఉండదని జీహెచ్ఎంసీ అధికారులు అనుకున్నట్లున్నారు. అందుకనే శనివారం ఉదయం జగన్ ఇంటిముందున్న పోలీసు సెక్యూరిటి నిర్మాణాలను తొలగించేశారు. విచిత్రం ఏమిటంటే సదరు నిర్మాణాలు తమకు అడ్డంగా ఉన్నాయని స్ధానికులు జీహెచ్ఎంసీకి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిర్మాణాలను తొలగించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పైగా ఈ నిర్మాణాలు కూడా అక్రమమే అని ఇపుడు అంటున్నారు. జగన్ భద్రత కోసం అప్పట్లో రోడ్డును ఆక్రమించి సెక్యూరిటి నిర్మాణాలను చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.

విచిత్రం ఏమిటంటే ఇవే నిర్మాణాలు ఐదేళ్ళుగా అక్కడే ఉన్నాయి. అప్పుడెవరూ ఈ నిర్మాణాలు తమకు అడ్డుగా ఉన్నాయని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయలేదా ? అన్న డౌట్ వస్తోంది. పోనీ ఇపుడు కూడా జగనే అధికారంలో ఉండుంటే ఈ నిర్మాణాలను రేవంత్ ప్రభుత్వం తొలగించేదేనా ? ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అధికారం కోల్పోతే పరిస్ధితులు ఎలాగుంటాయనేందుకు ఈ తొలగింపే తాజా ఉదాహరణ. జీహెచ్ఎంసీ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలను తొలగిస్తున్నపుడు జగన్ తాలూకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదట. అయినా ముఖ్యమంత్రి పదవే పోయిన తర్వాత ఈ అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చేయటాన్ని జగన్ పట్టించుకుంటారా ? ఇంకా ముందు ముందు ఇలాంటివాటిని మరెన్నింటిని జగన్ చూడాల్సొస్తుందో ?

Read More
Next Story