మూసీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. రాజకీయ రగడ తప్పదా..
x

మూసీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. రాజకీయ రగడ తప్పదా..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఎట్టిపరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేపడి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.


మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఎట్టిపరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేపడి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌పై ముందడుగు వేయడమే తప్ప వెనకడుగు వేసేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటకే ముసీ ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ చేశామని, అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నామని సీఎం వెల్లడించారు. నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌పై తొలుత నుంచి తీవ్ర వివాదం చెలరేగుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మూసీ బ్యూటీ కాదని లూటీ అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పలు సందర్బాల్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా సంక్షేమానికి లేని డబ్బులు మూసీ ప్రక్షాళనకు ఎక్కడి నుంచి వచ్చాయని మాజీ మంత్రి కేటీఆర్ కూడా పలుమార్లు ప్రశ్నించారు.

బండి సంజయ్ ఆరోపణలివే..

‘‘మూసీ పేరుతో కాంగ్రెస్ చేస్తున్నదంతా అవినీతే. మూసీ ప్రక్షాళన.. సుందరీకరణ.. పునరుజ్జీవం అంటూ మాటలు మారుస్తూ వస్తోంది ప్రభుత్వం. సీఎం రేవంత్ ఏమో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి లండన్‌లో థేమ్స్ నదిలా మూసీ మారుస్తానంటారు. మంత్రులేమో దక్షిణకొరియాలోని చంగ్ ఏ చంగ్ నదిలా మారుస్తామంటారు. ఎలా మార్చాలో వాళ్లకే ఒక క్లారిటీ లేదు. మూసీని అడ్డుకుపెట్టుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు కబ్జాలు చేసిన కట్టుకున్న భవనాల జోలికి వెళ్లే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా?’’ అని ఛాలంజ్ చేశారు బండి సంజయ్. పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, తమ ప్రాణాలు పణంగా పెట్టైనా కాపాడతామని హెచ్చరించారు. పేదోటి ఒంటిపైకి బుల్డోజర్ వెళ్లాలంటే తమను దాటే పోవాలని అన్నారు.

కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

తాము మూసీ సుందరీకరణ, ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చివేతలకు మాత్రం వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. పేదలను ఇళ్లను కూల్చాలన్న దుర్మార్గపు ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని కోరారు. ‘‘మూసీ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో మూడు నెలలు పాటు నివాసం ఉంటే ఈ ప్రాజెక్ట్‌ను విరమించుకుంటా అన్న సీఎం ఛాలెంజ్‌ను మేము స్వీకరిస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల ఇళ్లలో ఉండటానికి మేము సిద్ధమే. సీఎంకు చిత్తశుద్ది ఉంటే ఆయన మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించాలి’’ అని కిషన్ రెడ్డి తెలిపారు. రేవంల్ ఛాలెంజ్ చేసినట్లు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండటానికి తాము సిద్ధమేనని, అదే విధంగా పేదల ఇళ్లు కూల్చేమంటే చంచల్ గూడా, చర్లపల్లి జైలుకు వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నామని హెచ్చరించారు. ఇంతటి రాజకీయ రగడ మధ్య సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తామంటూ ప్రకటన చేయడం ప్రస్తుతం కీలకంగా మారింది.

Read More
Next Story