Fly Over | ఆరాంఘర్- జూపార్క్ ఫ్లైఓవర్ రేపు ప్రారంభం
x

Fly Over | ఆరాంఘర్- జూపార్క్ ఫ్లైఓవర్ రేపు ప్రారంభం

ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు ఆరు వరుసల ఫ్లైఓవర్ ను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.రూ.736 కోట్ల తో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధం చేశారు.


ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు ఆరు వరుసల ఫ్లైఓవర్ ను సోమవారం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.రూ.736 కోట్ల తో 4.04 కిలోమీటర్ల దూరం నిర్మించిన ఆరు లైన్ల ఫ్లైఓవర్ ప్రారంభానికి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేశారు.దశాబ్దాలుగా పాత నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో పరిష్కారమార్గం లభించినట్లయింది. ఈ ఫ్లై ఓవర్ పాతనగరానికి మణిహారంగా నిలిచింది.

- ఆరాంఘర్ నుంచి శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూం, శివరాంపల్లి, హాసన్ నగర్ ఆరు జంక్షన్లను కలుపుతూ ఆరాంఘర్ నుంచి నెహ్రూ జూలాజికల్ పార్కు వరకు ఫ్లై ఓవర్ నిర్మించారు.



- 4000మీటర్ల పొడవుతో వయాడక్ట్ భాగం పొడవు 3,720 మీటర్లతో 280 మీటర్ల ర్యాంప్ ల పొడవుతో ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించారు.

- ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఆరు లైన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి ఇది సహాయపడుతుంది.





Read More
Next Story