టాలీవుడ్‌లో లైంగికవేధింపులపై గళం విప్పిన ఫెమినిస్ట్ అలయెన్స్
టాలీవుడ్‌లో మహిళా నటీమణులపై సాగుతున్నలైంగిక వేధింపులపై ఆల్ఇండియా ఫెమినిస్ట్‌అలయెన్స్ గళం విప్పింది.ఈ మేరకు ఐఫా తెలంగాణ సీఎం రేవంత్,చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది.
టాలీవుడ్‌లో మహిళా నటీమణులపై సాగిన లైంగిక వేధింపుల పర్వంపై 2022వ సంవత్సరంలో సబ్ కమిటీ విచారణ జరిపి నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది.ఈ సబ్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని ప్రముఖ సినీనటి సమంత ఇటీవల డిమాండ్ చేసింది.సమంతతో పాటుపలువురు సినీనటీమణులు కూడా టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై విచారణ నివేదికను బయటపెట్టాలని కోరారు.
- టాలీవుడ్ విచారణ నివేదికను వెల్లడించి, పారదర్శకతను పాటించాలని ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయెన్స్ (ఏఐఎఫ్ఏ)తాజాగా డిమాండ్ చేసింది. ఈ మేరకు 53 మంది ఐఫా సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారిలకు లేఖ రాశారు.
- టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై సబ్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని ఐఫా రెండు పేజీల లేఖలో కోరింది.స్ట్రీ వాద కూటమి ప్రతినిధులు అరుంధతీ ఘోష్, మీనా సరస్వతి, సిమిన్ అక్తర్, రోహిణి, ప్రకృతి, అలీఫా, సాగరి రాందాస్, శృతినాయక్ తదితర 53 మంది తెలంగాణ సీఎంకు లేఖ రాశారు.
-టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై 2018వ సంవత్సరం అక్టోబరులో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం 2019 ఏప్రిల్ నెలలో కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత తుది నివేదికను 2022 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
- కేరళ ప్రభుత్వం హేమ కమిటీ నివేదికను బహిర్గతం చేసినా తెలంగాణ సర్కారు మాత్రం ఆ నివేదికను రహస్యంగా ఉంచింది.
హేమ కమిటీ రిపోర్టు వెలుగుచూడటంతో...
మాలీవుడ్‌లో వెలుగు చూసిన లైంగిక వేధింపుల వ్యవహారం హేమ కమిటీ నివేదికతో వెలుగులోకి వచ్చింది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు మలయాళ సినిమా ఇండస్ట్రీనీ వణికిస్తోంది.గతంలో హీరోయిన్ భావనకు కేరళలో ఎదురైన లైంగిక వేధింపుల ఘటనతో అప్పుడు హేమ కమిటీని కేరళ సర్కారు ఏర్పాటు చేసింది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టింది.
రిపోర్టు బయటపెట్టండి :ఐఫా
టాలీవుడ్‌లో మహిళా నటీమణులపై జరిగిన లైంగిక వేధింపులపై నివేదిక 2022జూన్ లో హైలెవెల్ కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను విడుదల చేయాలని, కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఐఫా కోరింది. తెలుగు ఫిలిం, టెలివిజన్ పరిశ్రమలో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని ఐఫా కోరింది.
కర్ణాటకలోనూ రిటైర్డు జడ్జీతో కమిటీ వేయాలని వినతి
కర్ణాటక రాష్ట్ర సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై రిటైర్డు జడ్జి నేతృత్వంలో కమిటీని నియమించాలని కన్నడ నటులు కిచ్చా సుదీప్, రమ్యలతో పాటు 100 మంది సినీనటీనటులు డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమలో మహిళా నటీమణులకు సురక్షితమైన వాతావరణం కల్పించలని వారు కోరారు.
Next Story