తెలంగాణలో రూ.6,500కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేసేదెన్నడు?
x

తెలంగాణలో రూ.6,500కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేసేదెన్నడు?

తెలంగాణలో రూ.6,500కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఫీజులను చెల్లించక విద్యార్థుల చదువులకు విఘాతం ఏర్పడింది.


తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు బకాయిలు ఆరేళ్లుగా పెండింగులోనే ఉన్నాయి. ఆరేళ్లుగా రూ.8వేల కోట్లు పెండింగులో ఉన్నాయి. గత మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు రూ.6,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించక పోవడంతో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు.

- తమ విద్యా అవసరాలను పట్టించుకోకుండా వ్యవసాయ రుణమాఫీ, హైడ్రా వంటి పథకాలకు నిధులు ఎందుకు కేటాయించారని విద్యార్థులు ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విద్యార్థులు ధర్నాలు చేశారు.
- తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. సోమవారం నాటి నిరసన కార్యక్రమంలో డీఎంఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేష్, టీఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్ పాల్గొన్నారు.

బకాయిలు విడుదల చేయండి : ఆర్ కృష్ణయ్య
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సోమవారం డిమాండ్ చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద విద్యార్థులు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు.
విద్యార్థుల చదవు పూర్తి అయినా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వలేదని, దీనివల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలు పొందలేక అవస్థలు పడుతున్నారు ఆర్ కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు.


Read More
Next Story