తండ్రీకూతుళ్ళు జలసమాధి
x

తండ్రీకూతుళ్ళు జలసమాధి

మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని, ఆమె తండ్రి జలసమాధి అయ్యారు.


మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని, ఆమె తండ్రి జలసమాధి అయ్యారు. వీరిద్దరూ గంగారం నుండి శంషాబాద్ విమానాశ్రయానికి కారులో బయలుదేరారు. పురుషోత్తమాయ గూడెం వద్ద వరదనీరు బ్రిడ్జి పై ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కారు అదుపుతప్పి నీటిలోకి జారిపోయింది. తమ కారు వాగులో పడిపోయిందని మెడ వరకు నీరు చేరుకొందని అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. కారులో కొట్టుకుపోయిన వారిలో అశ్విని మృతదేహం ధర్మారం పంట పొలాల వద్ద లభ్యమైంది. మోతీలాల్ మృతదేహం కోసం గాలిస్తున్నారు.

9 మంది మృత్యువాత

ఇక తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రంలో 9 మంది బ్రిటిష్ చెందినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనేకమంది వరద నీటిలో గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా పాలేరు వాగులో చిక్కుకున్న యాకూబ్ దంపతులు గల్లంతయ్యారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారి కుమారుడిని స్థానికులు, పోలీసులు రక్షించారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది బస్సులోని 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

Read More
Next Story