ప్రముఖ రచయిత్రి బొజ్జా విజయభారతి కన్నుమూత
ప్రముఖ రచయిత్రి, పౌరహక్కుల నేత బొజ్జా తారకం సతీమణి విజయభారతి శనివారం కన్నుమూశారు. విజయభారతి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్షనేత కేసీఆర్ సంతాపం తెలిపారు.
ప్రముఖ రచయిత్రి, మహాత్మా జ్యోతిరావు ఫూలే,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రలను సామాన్య ప్రజలకు అందుబాటులో తెచ్చిన బోయి బీమన్న గారి కుమార్తె, బొజ్జా తారకం గారి సతీమణి , సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా గారి మాతృమూర్తి డాక్టర్ బి.విజయభారతి గారు శనివారం కన్నుమూశారు.
సీఎం రేవంత్ సంతాపం
ప్రముఖ రచయిత్రి బి.విజయభారతి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం తెలిపారు.ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా గారి మాతృమూర్తి అయిన విజయభారతి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందించారని సీఎం గుర్తు చేశారు. విజయభారతి ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వెలువరించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు.సాహితీ రంగానికి విజయభారతి చేసిన సేవలు అపారమైనవని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
డాక్టర్ విజయభారతికి కేసీఆర్ నివాళి
సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి, అనువాధకురాలు, అంబేద్కరిస్ట్ డా విజయ భారతి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.సాహిత్య,సామాజిక అధ్యయనశీలిగా విశ్లేషకులు గా డాక్టర్ విజయభారతి గారు చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రముఖ రచయిత్రి, దివంగత పౌర హక్కుల నేత బొజ్జా తారకం గారి సతీమణి బి. విజయభారతి గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) September 28, 2024
ప్రముఖ రచయిత దివంగత బోయి భీమన్న గారి కుమార్తె, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా గారి మాతృమూర్తి అయిన విజయభారతి గారు తెలుగు… pic.twitter.com/apK0w3o6Nm
Next Story