రామేశ్వరం కెఫె కి వెళ్తున్నారా... ఆరోగ్యం జాగ్రత్త !!
x

రామేశ్వరం కెఫె కి వెళ్తున్నారా... ఆరోగ్యం జాగ్రత్త !!

మంచి రుచి, నాణ్యతలో రాజీ పడకపోవడమే రామేశ్వరం కెఫె ని యూనిక్ నెస్ అని యజమానులు చెబుతున్నారు. కానీ, రామేశ్వరం కెఫె లో ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారుల తనిఖీల్లో వెల్లడైన విషయాలకి పొంతన కుదరడం లేదు.


దేశంలో అందరూ మా ఫుడ్ కెఫె గురించి మాట్లాడుకోవాలి అనే లక్ష్యంతో రామేశ్వరం కెఫె స్టార్ట్ చేశామని చెబుతారు ఫుడ్ బిజినెస్ కపుల్ దివ్య రాఘవేంద్ర రావు, రాఘవేంద్ర. బెంగుళూరులో ఒకదాని తర్వాత ఒకటిగా నాలుగు బ్రాంచులు స్టార్ట్ చేసి కన్నడిగులు మనసు దోచి, సక్సెస్ జోష్ తో హైదరాబాద్ మాదాపూర్ లో గతేడాది డిసెంబర్ లో బ్రాంచ్ ఓపెన్ చేశారు. రెండేళ్లలోనే రామేశ్వరం కెఫె కస్టమర్లకు సౌత్ ఇండియన్ రుచుల్ని వేడివేడిగా అందిస్తూ ఫేవరెట్ ఫుడ్ డెస్టినేషన్ అయిపోయింది. మంచి రుచి, నాణ్యతలో రాజీ పడకపోవడమే రామేశ్వరం కెఫె ని యూనిక్ నెస్ అని యజమానులు చెబుతున్నారు.

కానీ, వారు చెప్పినదానికి.. రామేశ్వరం కెఫె లో ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారుల తనిఖీల్లో వెల్లడైన విషయాలకి పొంతన కుదరడం లేదు. ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తే ఆరోగ్యం సంగతి పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ కెఫె లో అవుట్ డేటెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ నిల్వ ఉన్నట్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ధారించారు.

అసలు విషయం ఏమిటంటే...

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషన్ బృందాలు వరుసగా ప్రముఖ రెస్టారెంట్లపై దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మాదాపూర్ లో రెండు పాపులర్ రెస్టారెంట్లపై తనిఖీలు చేశారు. రామేశ్వరం కెఫె, బాహుబలి కిచెన్ లలో ఇన్స్పెక్షన్ చేసిన అధికారులు... వీటిలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు.

రామేశ్వరం కెఫెలో ఈ మార్చితో గడువు ముగిసిన రూ. 16,000 విలువైన 100 కిలోగ్రాముల మినపపప్పును గుర్తించారు. తనిఖీ బృందాలు గడువు ముగిసిన 10 కిలోల పెరుగు, 8 లీటర్ల పాలను చూసి ఖంగు తిన్నారు. వీటన్నిటిని అక్కడే చెత్త బుట్టలో పడబోసారు.

లేబుల్స్ లేని రూ. రూ. 26,000 విలువ ఉన్న 450 కిలోల ముడి బియ్యం, 20 కిలోల వైట్ లోబియా, రూ. 30 వేలు విలువ చేసే 300కిలోల బెల్లంని టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా అందుబాటులో లేకపోవడం, కెఫెలో డస్ట్‌బిన్‌ లను మూతలతో సరిగ్గా కవర్ చేయకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాణ్యతలో రాజీ లేదంటూనే...

"రామేశ్వరం కెఫె అన్ని వంటకాలు అత్యుత్తమ, తాజా, అధిక నాణ్యత పదార్థాలు, అత్యున్నత పరిశుభ్రత ప్రామాణికతతో వినియోగదారులకు వేడిగా అందిస్తామని నిర్ధారిస్తుంది" అంటూ వారి అధికారిక వెబ్సైట్ లో ప్రకటించారు. కానీ మాదాపూర్ బ్రాంచ్ రామేశ్వరం కెఫె లో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. నాణ్యత కరువైందని అధికారుల దాడుల్లో స్పష్టం అయింది.


బాహుబలి కిచెన్ రెస్టారెంట్ లోనూ ఇదే తంతు...

బాహుబలి కిచెన్‌లో టాస్క్‌ఫోర్స్ బృందాలు సింథటిక్ ఫుడ్ కలర్‌ లను, విచ్చలవిడిగా బొద్దింకలు తిరగడాన్ని చూసి అవాక్కయ్యారు. స్టోర్ రూమ్‌లోని ఆహార పదార్థాలపై కూడా బొద్దింకలు కనిపించడంతో ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ రెస్టారెంట్ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు.

వంటగది చాలా అపరిశుభ్రంగా ఉండడమే కాదు.. సామాన్లు కడిగే ఏరియా మొత్తం నీటితో నిండిపోయింది. అంతేకాకుండా, సెమీ-ప్రొసెస్డ్ ఫుడ్ ని, రా వెజిటబుల్స్ ని ఫ్రిడ్జ్ లో సరిగ్గా నిల్వ చేయకపోవడంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోవడమే కాదు, రెస్టారెంట్ FSSAI లైసెన్స్ ఒరిజినల్ కాపీ కూడా చూపించకపోవడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story