గణేష్ ఉత్సవాల్లో చెలరేగిపోయిన ఈవ్‌టీజర్లు, ఆట కట్టించిన షీ టీమ్స్
హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ఈవ్ టీజర్లు చెలరేగిపోయారు.గణేష్ మండపాల వద్ద అమ్మాయిల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు.షీటీమ్స్ 996 మంది ఈవ్ టీజర్లను పట్టుకుంది.
అది ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం...వినాయకుడిని దర్శించుకునేందుకు అత్యంత ప్రపత్తులతో వచ్చిన యువతుల భుజాలు, తాకరాని చోట తాకుతూ కొందరు యువకులు వేధించారు. యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండగా షీ టీమ్ పోలీసులు దాన్ని వీడియో రికార్డు చేశారు.
- ఓ మధ్య వయస్కుడు ఓ మహిళ వెనుక క్యూలో నిలబడి తాకరాని చోట తాకుతూ చేతులతో పట్టుకున్నాడని షీ టీమ్ వీడియోలో వెల్లడైంది.
- ఓ యువకుడు ఓ అమ్మాయి వక్షోజాలను తాకుతూ పోయాడు. మరో యువకుడు అమ్మాయి నడుము పట్టుకున్నాడు.మరో యువకుడు చేత్తో అమ్మాయిలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలు, యువతులపై ఈవ్ టీజర్ల వేధింపులను షీ టీమ్స్ వీడియో సాక్ష్యాధారాలతో పట్టుకుంది. షీ టీమ్స్ విడుదల చేసిన నాలుగు వీడియోలు చూస్తే షాకవ్వాల్సిందే. దీనిలో ఈవ్ టీజర్ల బాగోతం బట్టబయలైంది.
996 మంది ఈవ్ టీజర్లపై కేసులు
హైదరాబాద్ నగరంలో కోలాహలంగా జరిగిన గణేష్ ఉత్సవాల్లో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈవ్ టీజర్లపై షీ టీమ్స్ కొరడా ఝళిపించింది. 11 రోజుల పాటు అత్యంత భక్తిప్రపత్తులతో సాగిన ఉత్సవాలు, నిమజ్జనోత్సవంలో ఈవ్ టీజర్లు అమ్మాయిలను అసభ్యంగా తాకారని షీ టీమ్స్ తీసిన వీడియోల్లో తేలింది. హైదరాబాద్ నగరంలో 996 మంది ఈవ్ టీజర్లు ఈ ఏడాది రెడ్ హ్యాండెడ్‌గా షీ టీమ్‌లకు దొరికారు.
షీటీమ్స్ వీడియో సాక్ష్యాలు
గణేష్ చతుర్థి ప్రధాన పండుగ. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నలుమూలలా ఏర్పాటైన పలు విభిన్న విగ్రహాలు, ఖైరతాబాద్ బడా గణేష్ దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించింది. ఈ గణేష్ ఉత్సవం సందర్భంగా తెలంగాణ షీ టీమ్స్ హైదరాబాద్‌లో 11 రోజుల వ్యవధిలో 996 మంది ఈవ్ టీజర్లను పట్టుకోవడం సంచలనం రేపింది. ఈవ్ టీజర్ల ఆగడాలపై వీడియో సాక్షాలున్నాయి.
ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద...
నగరంలోని ఖైరతాబాద్ బడా గణేష్ మండపం వద్ద, ఇతర రద్దీ ప్రాంతాల్లో మహిళా భక్తులతో ఈవ్ టీజర్లు అసభ్యంగా ప్రవర్తించారు. ఈవ్ టీజర్లు అమ్మాయిలను తాకుతూ వీడియో/ఫోటో ఆధారాలతో బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ చట్టంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.వీడియో ఆధారాలతో దొరికిన వారిపై కేసులు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పర్చారు. సీపీ చట్టం సెక్షన్ 70(సీ), 292 బీఎన్ఎస్ కింద ఈవ్ టీజర్లపై పెట్టీ కేసులు నమోదు చేశారు.
ఈవ్ టీజర్లకు షీ టీమ్స్ కౌన్సెలింగ్
ఈవ్ టీజర్లను సాక్ష్యాధారాలతో పాటు మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. కొన్ని సందర్భాల్లో వీడియో సాక్ష్యం దొరకని సందర్భాల్లో అటువంటి వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.గణేష్ పండుగ సందర్భంగా మహిళల భద్రత కోసం షీ టీమ్‌లు రౌండ్-ది-క్లాక్ పనిచేశాయి.
షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయండి
‘‘మీరు ఏదైనా అనుచిత ప్రవర్తనను చూసినట్లయితే, ప్రశాంతంగా ఉండకండి మీ వాయిస్‌ని పెంచండి,వెంటనే షీ టీమ్‌లకు నివేదించండి లేదా 100కి డయల్ చేయండి. షీ టీమ్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు, అసభ్యకర చర్యలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి’’ అని షీ టీమ్స్ డిప్యూటీ కమిషనర్ కోరారు.లేచి నిలబడండి, మాట్లాడండి మరియు హైదరాబాద్‌ను సురక్షితమైన నగరంగా ఉంచడానికి షీ టీమ్‌లు నిరంతరం పనిచేస్తాయని తెలుసుకోండి.సహాయం కోసం లేదా సంఘటనలను నివేదించడానికి, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 9490616555లో వాట్సాప్ ద్వారా షీ టీమ్స్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని మహిళల భద్రత పోలీసు కమిషనర్ సూచించారు.
Respect Women, Respect Humanity, stop teasing women, To report Dial 100 SHE TEAM @TelanganaCOPs @hydcitypolice @CPHydCity @tg_womensafety @CyberCrimeshyd @TrafficHYD @TG_SheTeams @Bharosa_TG @TG_ANB pic.twitter.com/Bn2UHLYMvp
— hyderabad she teams (@hydsheteam) September 18, 2024
Next Story