Ethanol Factory | నిర్మల్‌లోని ‘ఇథనాల్’ ఫ్యాక్టరీ ఎవరిదో చెప్పిన మంత్రి సీతక్క
x

Ethanol Factory | నిర్మల్‌లోని ‘ఇథనాల్’ ఫ్యాక్టరీ ఎవరిదో చెప్పిన మంత్రి సీతక్క

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లోని ఇథనాల్ ఫ్యాక్టరీపై మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏమనంటే..


నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లోని ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) అంశంపై మంత్రి సీతక్క(Seethakka) సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్‌కి(Talasani Srinivas) చెందినదేనని కూడా అన్నారు. ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ రోడ్డెక్కి నిరసనలు చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అపహాస్యం చేసిందని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా ఈ ఫ్యాక్టరీకి కేసీఆర్, కేటీఆర్ అనుమతులు ఇచ్చేశారని దుయ్యబట్టారు. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చేశారని, సంపూర్ణ అనుమతులు ఇచ్చేసినట్లు కేసీఆర్, కేటీఆర్ సంతకాలు కూడా ఉన్నాయని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో తమ ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

దమ్ముంటే చర్చకు రండి

‘‘దిలావర్పూర్‌లో ఆనాడు అనుమతులన్నీ బీఆర్ఎస్ పార్టీ అప్పనంగా అప్పచెప్పింది. బీఆర్ఎస్ విధానానికి ఆనాడు నిరసనలు చేస్తే అధికార బిఅరెస్ మమ్మల్ని అపహస్యం చేసింది. ఆనాడు కనీస గ్రామసభలు నిర్వహించకుండా ఏకపక్షంగా అనుమతులను సంస్థకు టిఆర్ఎస్ ఇచ్చింది. సంపూర్ణమైన అనుమతులు ఇచ్చింది కేసీఆర్ కేటీఆర్ సంతకాలు ఉన్నాయి. రాజకీయ దురుద్దేశం తో మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. పర్మిషన్ ఎవరిచ్చారు చర్చకు సిద్ధం రావాలని కోరుతున్నాం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ తో పాటు మరో 10 మంది డైరెక్టర్లు ఉన్నారు. కడప జిల్లా చెందిన పుట్ట సుధాకర్ కుమారుడు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆనాడు బీజేపీ గ్రామ సభలు అవసరం లేదని బీజేపీ సపోర్ట్ చేసింది. రెచ్చగొట్టే వైఖరి బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తాం. ఢిల్లీ బీజేపీ పెద్దలతో పర్మిషన్లు ఇప్పించింది కేటీఆర్, కేసీఆర్ వివరాలు బయటపడతాం. నీతి నిజాయితీ నీకుంటే మీ హయాంలో అనుమతులు ఇచ్చామని బీఆర్ఎస్ ఒప్పుకోవాలి. తప్పుడు ప్రచారాలతో మనుగడ సాధించలేరు. యూట్యూబ్ ఛానల్ లతో ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా పోవు. ఇథనాల్ సంస్థ వివాదంలో అసెంబ్లీలో చర్చ పెడతాం. ఆధారాలు స్పీకర్కు సమర్పిస్తాం. చర్చకు మేము సిద్ధం’’ అని సీతక్క వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కూడా పునరుద్ఘాటించారు. ప్రస్తుతం నిర్మల్‌లో ఆందోళనలకు కారణమైన ఇథనాల్ ఫ్యాక్టరీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడిదేనని వ్యాఖ్యానించారు.

జనాల్సి ముంచాలన్నదే కేసీఆర్ ఆలోచన: మహేష్

‘‘దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ కుమారుడు తలసాని సాయి కిరణ్‌దే. ఈ ఫ్యాక్టరీతో ప్రజలను మంచాలని కేసీఆర్ ప్రయత్నించారు. అందుకే ఈ సంస్థను తలసాని కుమారుడి చేతికి అందించారు. ఈ కంపెనీకి కేసీఆర్, కేటీఆర్ కలిసే అనుమతులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి, ఈ ఫ్యాక్టరీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ సంస్థ ఎవరిదో తేల్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలు దిలావర్‌పూర్కు రావాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. కాగా సీతక్క, మహేష్ కుమార్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. తమ అసమర్దతను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీతక్క, మహేష్ కుమార్ వ్యాఖ్యాలను తోసిపుచ్చారు. వారు తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

చర్చకు నేను రెడీ: తలసాని

‘‘అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. పీసీసీ చీఫ్, మంత్రి సీతక్క, ఎంపీ చామల కామెంట్స్‌ను ఖండిస్తున్నాను. ఇథనాల్ కంపెనీతో నాకొడుకు సాయి కిరణ్‌కు ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే.. కంపెనీ వాళ్ళకే రాసిస్తా. పీసీసీ చీఫ్‌కు ఇదే నా సవాల్. ఇథనాల్ కంపెనీపై ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. సందర్భం వచ్చినప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోన్న వారికి నేనేంటో చూపిస్తాను. ఇథనాల్ కంపెనీకి పర్మిమిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని చెప్పారు.

అది మాత్రం వాస్తవం: తలసాని

‘‘టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. 2016 లో రాజమండ్రి ప్రాంతంలో నాకుమారుడు వేరే కంపెనీని పెట్టాలనుకున్నది వాస్తవం. అయితే మూడు నెలలకే కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశాడు. కంపెనీ పెట్టించే వాళ్ళం మేమే అయితే.. రైతులను మేమెందుకు రెచ్చగొడుతాం. BRS ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని పేర్కొనడం విడ్డూరం. ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్న విషయం కూడా తెలుసుకోరా? బాధ్యతగల పదవిలో ఉన్నవారు ఆచీతూచీ ఆరోపణలు చేయాలి. ప్రజల సమస్యను పరిష్కరించకుండా. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. నన్ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుంది. లగచర్ల సహా.. ప్రతిదానిలో కాంగ్రెస్ ప్రభుత్వం అబాసు పాలవుతుంది. లేనివి ఉన్నట్లు చెప్పటం దుర్మార్గమైన చర్య. రైతులు చేస్తున్న ఆందోళనను పరిష్కరించకుండా తప్పుడు ఆరోపణలు మానుకోవాలి’’ అని సూచించారు.

Read More
Next Story