పెండింగ్ బిల్లు కట్టమంటే ఎంత పని చేశాడు?
x

పెండింగ్ బిల్లు కట్టమంటే ఎంత పని చేశాడు?

పెండింగ్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బందిపై పై ఓ యువకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు.


హైదరాబాద్ సనత్ నగర్ లో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పెండింగ్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బందిపై పై ఓ యువకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజెన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... లైన్ ఇన్‌స్పెక్టర్ సాయి గణేష్ రోజువారీ విధుల్లో భాగంగా సనత్ నగర్ లో పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లుల అమౌంట్ ని వసూలు చేసేందుకు వెళ్ళాడు. రాములు అనే వ్యక్తి ఇంటివద్దకు వెళ్లి పెండింగ్ బిల్లు రూ. 6,858 కట్టమని అడిగాడు. పెండింగ్ బిల్లు కట్టేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. దీంతో సిబ్బంది అతని ఇంటికి విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. కరెంటు కట్ చేశారు. ఇది సహించని ఇంటి యజమాని, అతని కొడుకు మురళీధర్ రావు (19) లైన్ ఇన్‌స్పెక్టర్ పై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. పిడిగుద్దులు కురిపించాడు. దీంతో లైన్ ఇన్‌స్పెక్టర్ సాయి గణేష్ తీవ్రగాయాలపాలై కుప్పకూలిపోయాడు.

అయితే, ఈ ఘటన నడివీధిలో అందరు చూస్తుండగానే జరిగింది. స్థానికులు మురళీధర్ ని లాగేందుకు ప్రయత్నించినా అతను మళ్ళీ సాయి గణేష్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు లైన్ ఇన్‌స్పెక్టర్ తో వచ్చిన సిబ్బందితో కూడా వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, దాడి చేసిన యువకుడు బాక్సర్ అని తెలుస్తోంది. ఘటనపై బాధితుడు సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటివరకూ కట్టకపోగా... అడిగిన సిబ్బందిపైనే దాడి చేయడాన్ని విద్యుత్ అధికారులు తప్పుబడుతున్నారు. మాధవ్ రావు చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి సరికాదని.. దీనిపై విచారణ చేపడతామని అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తామని చెప్పారు.

Read More
Next Story