అసోం రాష్ట్రంలో భూకంపం
x

అసోం రాష్ట్రంలో భూకంపం

అసోం రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. మోరిగావ్ జిల్లాలో ఈ తెల్లవారుజామున 2.25 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5 గా నమోదైంది.


అసోం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున 2.25 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం వల్ల ఇళ్లలో వస్తువులు కదలడంతో శబ్ధాలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో వచ్చిన భూకంపాన్ని ఓ మోస్తరు భూకంపంగా పరిగణిస్తామని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.ఈ భూకంపం వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.

అసోం రాష్ట్రంలోని మోరిగావ్ కేంద్రంగా 91 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. మోరిగావ్ పట్టణానికి వాయువ్యంగా 18.7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని అధికారులు చెప్పారు. అసోం రాష్ట్రంలోని మోరిగావ్ తో పాటు గౌహతి, మేఘాలయ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. భూప్రకంపననలతో గౌహతి వాసులు నిద్ర లేచారు.భూకంపంతో అల్మారాల నుంచి వస్తువులు కింద పడ్డాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని అసోం అధికారులు కోరారు.


Read More
Next Story