Drunken Drive : రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి, అనాథలైన పిల్లలు
x

Drunken Drive : రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి, అనాథలైన పిల్లలు

హైదరాబాద్ నగరంలో ఓ మందు బాబు వేగంగా కారు నడిపి చేసిన ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించారు. దీంతో వారిద్దరి పిల్లలు అనాథలయ్యారు.


హైదరాబాద్ నగరంలో పీకల దాకా మద్యం తాగి కారు నడిపి (Drunken Drive) ద్విచక్రవాహనం, ఆటోను ఢీకొట్టి దంపతుల మృతికి కారణమైన ఘటన శనివారం రాత్రి వెలుగుచూసింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు సరిగా చేపట్టక పోవడంతో మందుబాబులు ఫుల్ గా మందు కొట్టేసి రోడ్లపై వాహనాలతో వచ్చి రోడ్డు ప్రమాదాలకు(Road Accident) కారణమవుతున్నారు.

- హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ ఫ్లైఓవర్ వద్ద వేగంగా వస్తున్న ఓ కారు సృష్టించిన బీభత్సం వల్ల బైక్ పై వస్తున్న దంపతులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులైన దినేష్ గోస్వామి(35), మోనా ఠాకూర్ (33) మరణించారు.
-ప్రవీణ్ అర్దరాత్రి 12 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో ఉండి కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు.అతివేగంగా కారు నడుపుతూ ఫ్లైఓవర్ పై నుంచి దిగుతూ స్కూటీపై వెళుతున్న మోనా, దినేష్ ల మృతికి కారణమయ్యారు. మోనా రెండు నెలల గర్భవతి అని పోలీసులు చెప్పారు.
ప్రమాద దృశ్యాలు లంగర్ హౌస్ రోడ్డుపై విరజిమ్మిన రక్తం చూసి మృతుల బంధువులు విలిపించారు. యాదవ బస్తీకి చెందిన మోనా, దినేష్ లు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని గోవానుంచి శనివారం సాయంత్రమే వచ్చారు. అనారోగ్యం బారిన పడిన బంధువులను పరామర్శించేందుకు నందినగర్ కు వెళుతుండగా కారు ఢీకొనడంతో మరణించారు.

మృతులకు ప్రేరణ శ్రీ, ధృతి శ్రీ కుమార్తెలు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.తల్లిదండ్రుల మృతితో చిన్నారులు పడుతున్న బాధ వర్ణనా తీతంగా మారింది. దీంతో వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల రోదనలు మిన్నంటాయి.తాను పైలెట్ కావాలనేది అమ్మ కోరికని ప్రేరణశ్రీ చెప్పింది.తమకు న్యాయం చేయాలని, తన తల్లిదండ్రుల కోరిక మేర తాము ఉన్నతంగా ఎదుగుతామని వారు పేర్కొన్నారు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేస్తే మా తల్లిదండ్రలు మాకు దక్కేవారని కుమార్తెలిద్దరూ విలపిస్తూ చెప్పారు.


Read More
Next Story