
టెస్ట్ కాప్షన్ 1
తెలంగాణలో ఇఫ్తార్ పేరిట నిధుల వృథా వద్దు
ఇఫ్తార్ దావత్ పేరిట నిధుల దుర్వినియోగం చేయవద్దని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.యాక్టివిస్ట్ డాక్టర్ లుబ్నా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీర్మానించారు.
మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన నిధులను ఇఫ్తార్ దావత్ లకు ఉపయోగించకుండా నిరుపేద ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి వెచ్చించాలని సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ లుబ్నా సార్వత్ డిమాండ్ చేశారు. లుబ్నా సార్వత్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు, విద్యార్థులు, సీనియర్ పౌరులు, ఇమామ్ లు, ఖతీబ్ లు, న్యాయవాదులు, రొటేరియన్లతో ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇఫ్తార్ దావత్ ను ఏకగ్రీవంగా ఖండించారు. ఈ నిధులను దావత్ కోసం వ్యర్థం చేయకుండా పేద ముస్లింల విద్య, ఉపాధి, పోషణ నిమిత్తం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఇఫ్తార్ దావత్ ను రద్దు చేయండి
మార్చి 21 లేదా 22 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఇఫ్తార్ దావత్ ను రద్దు చేయాలని డాక్టర్ లుబ్నా సార్వత్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇఫ్తార్ పేరిట 850 మసీదులకు లక్ష రూపాయల చొప్పున నిధులను కేటాయించడం వృథా అని ఆమె చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో సాగిన ఇఫ్తార్ దావత్ లపై తాము 2017,2018 సంవత్సరాల్లో వేసిన రెండు పిల్ లు(నంబరు 143,142 హైకోర్టులో పెండింగులో ఉండగా, ఈ దావత్ పేరిట నిధులు వృథా చేయవద్దని ఆమె కోరారు. ఇఫ్తార్ పేరిట నిధులను వ్యర్థం చేయడాన్ని ఇస్తాం అంగీకరించదని ఆమె స్పష్టం చేశారు. పేదల సంక్షేమానికి వెచ్చించాల్సిన నిధులను ఇఫ్తార్ విందులకు ఖర్చు చేయవద్దని ఆమె కోరారు. గతంలో ఇఫ్తార్ విందుల పేరిట ఎలాంటి టెండర్లు లేకుండా సర్కారు నిధులను దుర్వినియోగం చేశారని, దీనిపై దర్యాప్తు జరిపించాలని డాక్టర్ లుబ్నా డిమాండ్ చేశారు.
విద్యాభివృద్ధికి నిధులివ్వండి
చదువుకునేందుకు పిల్లలకు స్కాలర్ షిప్ లు ఇవ్వకుండా ఇఫ్తార్ పేరిట కోట్లరూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని డాక్టర్ లుబ్నా ఆరోపించారు. ఇఫ్తార్ నిధులను విద్యార్థుల స్కాలర్ షిప్ లకు వెచ్చించాలని కోరారు. సొంత డబ్బుతో ఇఫ్తార్ ఇవ్వాలి కాని, ప్రభుత్వ నిధులు వెచ్చించరాదని ఆమో సూచించారు. దళితుల కంటే విద్యారంగంలో వెనుకబడిన ముస్లింల చదువుల కోసం ఈ నిధులు ఖర్చు చేయాలని కోరారు. పాఠశాలల్లో ముస్లిం పిల్లల డ్రాపవుట్స్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు.సచార్ కమిటీ సిఫార్సుల ప్రకారం ముస్లింల విద్యాభివృద్ధికి నిధులు కేటాయించాలని సూచించారు.
నిధుల దుర్వినియోగం వద్దు
ఇఫ్తార్ విందు పేరిట ప్రజా సంక్షేమ నిధుల దుబారాను వెంటనే రద్దు చేయాలని డాక్టర్ లుబ్నా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత అవినీతి బీఆర్ఎస్ పాలన ఆనవాయితీ పేరిట నిధులు వ్యర్థం చేయవద్దని కోరారు. రూ.70 కోట్లను వెచ్చించి ఇస్తున్న ఇఫ్తార్‌ను రద్దు చేసి, ఆ నిధులను విద్యా సంస్థలకు కేటాయించాలని కోరారు. ఇఫ్తార్‌కు కేటాయించిన విలువైన ప్రజా ధనం రూ.70 కోట్లలో ప్రస్తుతం రూ.4 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ మైనారిటీస్ లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Next Story