హైదరాబాద్ లో ఇళ్లకు డిజిటల్ డోర్ నంబర్లు
x

హైదరాబాద్ లో ఇళ్లకు డిజిటల్ డోర్ నంబర్లు

హైదరాబాద్ లో ఇళ్ళకి డిజిటల్ డోర్ నంబర్లు రానున్నాయి. జిఐఎస్ సర్వేలో భాగంగా హైదరాబాద్‌ లోని ఇళ్లకు జీహెచ్ఎంసీ డిజిటల్ డోర్ నంబర్లు అందజేయనుంది.


హైదరాబాద్ లో ఇళ్ళకి డిజిటల్ డోర్ నంబర్లు రానున్నాయి. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) సర్వేలో భాగంగా హైదరాబాద్‌ లోని ఇళ్లకు జీహెచ్ఎంసీ డిజిటల్ డోర్ నంబర్లు అందజేయనుంది. వెదర్ ప్రూఫ్, టెక్నాలజీ-ఎనేబుల్డ్ ప్లేట్‌లో ముద్రించబడి, సులభంగా యాక్సెస్ కోసం డోర్ బయట నంబర్, అలాగే QR కోడ్ అతికించబడతాయి.

హైదరాబాద్ అంతటా అన్ని ప్రాపర్టీలు, యుటిలిటీలను జియో-ట్యాగింగ్ చేసిన తర్వాత డిజిటల్ డోర్ నంబరింగ్ (డీడీఎన్) చేయబడుతుంది. ఈ-గవర్నెన్స్ సేవలు, అత్యవసర సహాయాన్ని సులభతరం చేయడానికి ప్రతి ఆస్తికి ఒక ప్రత్యేక సీక్వెన్షియల్ నంబర్ కూడా రూపొందించబడుతుంది. మల్టిపుల్ సర్వీస్లను ఒక ఐడీకి కనెక్ట్ చేయడంతో పాటు, ఇది జీహెచ్ఎంసీ డిపార్ట్‌మెంట్లలో ఒకే విధమైన కమ్యూనికేషన్ కి సహకరిస్తుంది అని అధికారులు ఆలోచిస్తున్నారు.

అంతేకాకుండా, రోడ్ నెట్‌ వర్క్‌ లు, నాలాలు, కల్వర్టులు, వీధి దీపాలు, చెరువులు, పార్కులు, అగ్నిమాపక కేంద్రాలు, ఫ్లై ఓవర్‌లు, కమ్యూనిటీ హాళ్లు ఇంకా అనేక యుటిలిటీస్ కూడా బేస్ మ్యాప్‌లో గుర్తించబడతాయి. వీటికి సంబంధించిన మేజర్ ఫిజికల్ డీటెయిల్స్ మ్యాప్ నుంచి ఆటో ఫెచ్ అవుతాయి. ఇతర సివిక్ డిపార్టుమెంట్ల నుంచి సైతం యాట్రిబ్యూట్ డేటాను కూడా సేకరించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది.

వ్యక్తుల ప్రైవసీ, సెక్యూరిటీ అంశాలను దృష్టిలో ఉంచుకుని సర్వేల సమయంలో వారి వ్యక్తిగత సమాచారం సేకరించకుండా ఫీల్డ్ సర్వేలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. యుటిలిటీ మ్యాపింగ్, అసెట్ మేనేజ్‌మెంట్‌ ల ఆధారంగా సర్వే చేయడంపై ఫోకస్ పెట్టింది. సిటిజన్స్ నుంచి ఆధార్, పాన్, ఇతర గుర్తింపు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం కూడా తీసుకోబోదు. ఈ ఆన్ ఫీల్డ్, డ్రోన్ సర్వే ఫలితాలు వివిధ పరిపాలనా నిర్ణయాలకు దోహదం చేస్తాయి అని ప్రభుత్వం భావిస్తోంది.

Read More
Next Story